https://oktelugu.com/

పవన్‌ బర్త్‌డే స్పెషల్‌… ఓ సర్ప్రైజ్‌, ఓ సస్పెన్స్‌

ఈ వారంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పండగలా జరుపుకున్న అభిమానులు ఇప్పుడు మరో ఫెస్టివల్‌కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవర్‌‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 49వ పుట్టినరోజును అదిరిపోయే రేంజ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్‌ బర్త్‌డే కోసం నెల రోజుల నుంచే ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. పవర్ స్టార్ బర్త్‌ డే కామన్‌ డిస్‌ప్లే పిక్చర్ రీట్వీట్లతో వరల్డ్‌ రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ రెండో తేదీ ఎప్పుడొస్తుందా అని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 28, 2020 / 08:08 PM IST
    Follow us on


    ఈ వారంలోనే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజును పండగలా జరుపుకున్న అభిమానులు ఇప్పుడు మరో ఫెస్టివల్‌కు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2వ తేదీన పవర్‌‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ 49వ పుట్టినరోజును అదిరిపోయే రేంజ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్‌ బర్త్‌డే కోసం నెల రోజుల నుంచే ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. పవర్ స్టార్ బర్త్‌ డే కామన్‌ డిస్‌ప్లే పిక్చర్ రీట్వీట్లతో వరల్డ్‌ రికార్డు సృష్టించారు. సెప్టెంబర్ రెండో తేదీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు వారి కోసం పవన్‌ కళ్యాణ్‌ నుంచి కూడా బహుమతి సిద్ధమవుతోంది. ఒక సర్ప్రైజ్‌తో పాటు ఓ సస్పెన్స్‌ తో కూడిన ట్రీట్‌ ఇవ్వనున్నాడు పవన్‌.

    Also Read: ‘ఎన్టీఆర్’కి రాజకీయాలే వ్యాపారం అట !

    అజ్ఞాతవాసి తర్వాత కొంతకాల ఇండస్ట్రీకి దూరమైన పవన్.. ‘వకీల్ సాబ్’తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’కు ఇది రీమేక్‌. ఇందులో పవర్ స్టార్ లాయర్ పాత్రలో కనువిందు చేయనున్నాడు. నివేదా థామస్, అంజలి, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోర్టు హాల్‌లో పవన్‌ అదిరిపోయే పెర్ఫామెన్స్‌ అభిమానులను మెస్మరైజ్‌ చేసేలా తీర్చిదిద్దుతున్నాడు వేణు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయినప్పటికీ పవన్‌ పుట్టిన రోజున ‘వకీల్‌ సాబ్‌’ నుంచి సర్ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని చిత్ర బృందం ప్లాన్‌ చేసిందని సమాచారం. సెప్టెంబర్ రెండో తేదీన ఈ మూవీ మోషన్‌ పోస్టర్తో పాటు కుదిరితే టీజర్ కూడా రిలీజ్‌ చేసే అవకాశం కనిపిస్తోంది. చివరి నిమిషం వరకూ దీన్ని సస్పెన్స్‌గా ఉంచాలని చూస్తోందట.

    Also Read: సూపర్ హిట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కి సినిమా లేదు !

    మరోవైపు పవన్‌ తదుపరి సినిమాకు దర్శకత్వం వహించే క్రిష్‌ కూడా ఓ బహుమతి రెడీ చేస్తున్నాడట. సెప్టెంబర్రెండో తేదీన తమ సినిమా టైటిల్‌ను అనౌన్స్‌ చేసి సర్ప్రైజ్‌ ఇవ్వాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ లెక్కన పవన్‌ అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ గ్యారంటీ.