Pawan Kalyan Hari Hara Veera Mallu: మరికొద్ది గంటల్లో మన ముందుకు పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం రాబోతుంది. ఈ సినిమా కథ మొత్తం కోహినూర్ వజ్రం(Kohinoor Diamond) చుట్టూ తిరుగుతుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. సినిమా టైటిల్ లోగో లోనే కోహినూర్ వజ్రం ఉంటుంది. అయితే అసలు ఈ కోహినూర్ వజ్రం ప్రస్థానం ఏమిటి?, అసలు ఇది ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది చాలా మందికి తెలియదు. ఈ అంశాలన్నీ సినిమాలో చూపిస్తారో లేదో తెలియదు కానీ, అసలు ఈ కోహినూర్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఈ వజ్రం మన తెలుగు నేల మీద దొరికినదే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న చారిత్రాత్మక కొల్లూరు గనుల్లో ఈ వజ్రం, కాకతీయ సామ్రాజ్య పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. అక్కడి నుండి అనేక రాజ్యాలు దాటుతూ కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ని తనలో దాచుకుంది.
Also Read: పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ ఊహించని షాక్.. ఇక వీరమల్లు కష్టమే!
ఇక ఈ వజ్రం కోసం అప్పట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. కాకతీయులపై దండయాత్ర చేసి వారి పై విజయం సాధించిన ఢిల్లీ సుల్తానేట్ మాలిక్ కాఫోర్ ఈ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి చెందిన సాజాహాన్ దీనిని తన నెమలి సింహాసనం పై అలంకరించాడు. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ లో మనం ఈ నెమలి సింహాసనాన్ని చూడొచ్చు. ఇక ఆ తర్వాత 18 వ శతాబ్దం లో పర్షియా రాజ్య పాలకుడు నాదిర్ షా ఢిల్లీ మొఘల్ సామ్రాజ్య పాలకులపై దండయాత్ర చేసి ఈ కోహినూర్ వజ్రాన్ని తన కైవసం చేసుకున్నాడు. ఈ వజ్రం నుండి వస్తున్న కాంతిని చూసి నాదిర్ షా దీనికి కోహినూర్ అనే నామకరణం చేశాడు. ఇక ఆ తర్వాత ఈ కోహినూర్ వజ్రం సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మహారాజ రంజిత్ సింగ్ చేతుల్లోకి వచ్చింది. ఆయన ఈ వజ్రాన్ని మన భారత దేశానికీ తీసుకొచ్చాడు.
Also Read: ఏఎన్నార్ కి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?
ఇక ఆ తర్వాత 1849 వ సంవత్సరం లో ఆంగ్లో, సిక్కు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సిక్కు సామ్రాజ్యం దారుణంగా ఓడిపోయింది. దీంతో బ్రిటీష్ వారు అప్పట్లో పదేళ్ల వయస్సున్న దులీప్ సింగ్ తో ‘లాహోర్ ఒప్పందం’ చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రాన్ని బ్రిటీష్ సామ్రాజ్య మహారాణి విక్టోరియా కు అప్పగించాల్సి వచ్చింది. అప్పటి నుండి ఈ వజ్రం రాణి కిరీటాన్ని అలంకరిస్తూ వచ్చింది అని అందరు అంటూ ఉంటారు. ప్రస్తుతం ఇది లండన్ మ్యూజియం లో కొలువై ఉన్నది. అయితే ఇది ఒప్పందం ప్రకారం ఇచ్చింది కాదని, బ్రిటీష్ వారు దౌర్జన్యం చేసి బలవంతంగా వాళ్ళ దేశానికీ ఈ అమూల్యమైన వజ్రాన్ని పట్టుకొని వెళ్లారని మన చరిత్రకారులు అంటూ ఉంటారు.