Pawan Kalyan- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’గా చిరపరిచయమే.. ఆయన ఖైదీగా నటించిన సినిమాలన్నీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి మళ్లీ సినీ రంగప్రవేశం చేసింది కూడా ‘ఖైదీ’ సినిమాతోనే. అయితే చిరుకు ‘ఖైదీ’ సెంటిమెంట్ ఉండగా.. ఆయన తమ్ముడు పవర్ స్టార్ కు ‘పోలీస్’ సెంటిమెంట్ కలిసివచ్చింది.
Pawan Kalyan- Chiranjeevi
గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ లు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. అదే ఊపులో వస్తున్న మూవీ ‘భీమ్లానాయక్’. ఇందులోనూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరంభం.. బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్పాట్ లు ఇక భస్మీపటలమేనా?
Pawan Kalyan- Chiranjeevi
యాదృశ్చికంగా జరిగిందో ఏమో కానీ.. తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్ తోపాటు.. పవన్ ‘భీమ్లానాయక్’ మూవీ షూటింగ్ ఒకే చోట జరిగింది. దీంతో అన్నాదమ్ములు చిరు-పవన్ లు కలుసుకున్నారు. చిరంజీవి ‘ఖైదీ’ డ్రెస్ లో కనిపించగా.. పవన్ ‘పోలీస్ గా’ అగుపించారు. వీరిద్దరూ పోలీస్ -ఖైదీగా ఫొటోలకు ఫోజిచ్చారు.
వీరితోపాటు భీమ్లానాయక్ టీంలోని రానా, త్రివిక్రమ్, సాగర్ కే చంద్ర తదితరులు చిరు, పవన్ లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇలా అన్నాదమ్ముల కలయికకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: అజిత్ ‘వలీమై’ యూఎస్ ప్రీమియర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
Recommended Video: