Pawan Kalyan- Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’గా చిరపరిచయమే.. ఆయన ఖైదీగా నటించిన సినిమాలన్నీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చి మళ్లీ సినీ రంగప్రవేశం చేసింది కూడా ‘ఖైదీ’ సినిమాతోనే. అయితే చిరుకు ‘ఖైదీ’ సెంటిమెంట్ ఉండగా.. ఆయన తమ్ముడు పవర్ స్టార్ కు ‘పోలీస్’ సెంటిమెంట్ కలిసివచ్చింది.

గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ లు పవన్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. అదే ఊపులో వస్తున్న మూవీ ‘భీమ్లానాయక్’. ఇందులోనూ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ఆరంభం.. బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ స్పాట్ లు ఇక భస్మీపటలమేనా?

యాదృశ్చికంగా జరిగిందో ఏమో కానీ.. తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్ తోపాటు.. పవన్ ‘భీమ్లానాయక్’ మూవీ షూటింగ్ ఒకే చోట జరిగింది. దీంతో అన్నాదమ్ములు చిరు-పవన్ లు కలుసుకున్నారు. చిరంజీవి ‘ఖైదీ’ డ్రెస్ లో కనిపించగా.. పవన్ ‘పోలీస్ గా’ అగుపించారు. వీరిద్దరూ పోలీస్ -ఖైదీగా ఫొటోలకు ఫోజిచ్చారు.
వీరితోపాటు భీమ్లానాయక్ టీంలోని రానా, త్రివిక్రమ్, సాగర్ కే చంద్ర తదితరులు చిరు, పవన్ లతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇలా అన్నాదమ్ముల కలయికకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: అజిత్ ‘వలీమై’ యూఎస్ ప్రీమియర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
Recommended Video:
[…] India vs Sri lanka: భారత్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ గురువారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఇరు జట్లు రెడీ అయ్యాయి ప్రత్యర్థిని ఇరుకున పెట్టే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. గాయాల కారణంగా జట్టుకు కొందరు దూరమైనా ఆ ప్రభావం జట్లపై పడకుండా చూసుకుంటున్నాయి. ఇదివరకే వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఇందులో కూడా రాణించి శ్రీలంకకు ధీటైన సమాధానం చెప్పాలని చూస్తోంది. […]
[…] Actor Nadhiya: నదియా అంటే చాలా మందికి తెలియక పోవచ్చు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్త అంటే మాత్రం అందరు ఈజీగా గుర్తు పడతారు. అంతలా ఈమె ఒకే సినిమాతో టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అయ్యింది. అయితే ఈమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.. ఇప్పటి అందాల అత్తమ్మ అప్పుడు హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. ఈమె తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్ గా నటించింది. […]