https://oktelugu.com/

Pavitra Lokesh: నరేష్ లో నాకు నచ్చింది అదే… పవిత్ర లోకేష్ రొమాంటిక్ కామెంట్స్

నరేష్ ఈ రోజు గురించే ఆలోచిస్తారు. ఇప్పుడు తనకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. రేపు అనేది ఉంటే రానివ్వు అప్పుడు చూసుకుందాం అంటారు.

Written By:
  • Shiva
  • , Updated On : May 24, 2023 / 10:13 AM IST

    Pavitra Lokesh

    Follow us on

    Pavitra Lokesh: మళ్ళీ పెళ్లి మూవీ విడుదలకు సిద్ధమైంది. ప్రధాన పాత్రలు చేసిన నరేష్, పవిత్ర లోకేష్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. పవిత్ర లోకేష్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. నరేష్ తో ఆమె సహజీవనం చేస్తున్న తరుణంలో ఆయనలో మీకు నచ్చిన లక్షణాలు ఏంటని యాంకర్ అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా… నరేష్ ఎంత సీరియస్ మేటర్ అయినా లైట్ గా తీసుకుంటారు. అయితే దాన్ని పరిష్కరించేందుకు సీరియస్ గా ప్రయత్నం చేస్తారు. ఆ క్వాలిటీ నాలో లేదు. నేను చిన్న విషయాలను కూడా సీరియస్ గా తీసుకుని అతిగా ఆలోచిస్తాను.

    నరేష్ ఈ రోజు గురించే ఆలోచిస్తారు. ఇప్పుడు తనకు ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. రేపు అనేది ఉంటే రానివ్వు అప్పుడు చూసుకుందాం అంటారు. ఈ క్వాలిటీ ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. అన్నింటికీ మించి నరేష్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంత కంటే కావాల్సింది ఏముంది. అందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నరేష్ లో నాకు నచ్చిన లక్షణాలు ఇవే… అని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చారు.

    ఇక మళ్ళీ పెళ్లి మూవీ గురించి మాట్లాడుతూ… ఇది బోల్డ్ మూవీ. ఎవరిపై రివేంజ్ తో తీసిన చిత్రం కాదు. ఇది బయోపిక్కా కాదా అనేది మీరు చూసి చెప్పాలి. ఈ మూవీలో ఎమోషన్స్ తో పాటు మంచి సందేశం కూడా ఉందని పవిత్ర చెప్పుకొచ్చారు. నరేష్ పేరెంట్స్ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో పవిత్ర మాట్లాడారు. విజయనిర్మలను కలిశాను కానీ ఎక్కువ అనుబంధం లేదు. అప్పటికే ఆమె ఆరోగ్యం సరిగా లేదు. కృష్ణ గారితో ఎక్కువ సమయం లభించింది. కృష్ణ రోజూ నాతో మాట్లాడేవారని ఆమె వెల్లడించారు.

    నరేష్-పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి నిజ జీవితాల ఆధారంగా మళ్ళీ పెళ్లి తెరకెక్కింది. సీనియర్ నిర్మాత ఎమ్ ఎస్ రాజు మళ్ళీ పెళ్లి చిత్రానికి దర్శకత్వం వహించారు. నరేష్ స్వయంగా నిర్మించారు. మే 26న వరల్డ్ వైడ్ తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో మళ్ళీ పెళ్లి చిత్రంపై హైప్ ఏర్పడింది.