Pavitra Lokesh: నటిగా వందకు పైగా చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు పవిత్ర లోకేష్ కి ఎఫైర్ రూమర్స్ తో వచ్చింది. కొన్ని నెలలుగా ఆమె పేరు మీడియాలో మారుమ్రోగుతుంది. నటుడు నరేష్ ఆమెతో సహజీవనం చేస్తున్నానంటూ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇద్దరూ కలిసి గుడులు గోపురాలు సందర్శిస్తూ, ప్రత్యేక పూజలు చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో నరేష్-పవిత్ర వివాహం చేసుకున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలకు నరేష్ స్పష్టత ఇచ్చారు. మేము వివాహం చేసుకోలేదు. అయితే కలిసి జీవిస్తున్నామని క్లియర్ గా చెప్పారు.

నరేష్ కి దగ్గరయ్యాక పవిత్ర లైఫ్ మారిపోయిందని ఆమె సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని తెలుస్తుంది. బిజీ ఆర్టిస్ట్ అయిన నరేష్ కోట్ల సంపాదన కలిగి ఉన్నాడు. అలాగే తల్లి విజయనిర్మల నుండి ఆయన భారీ మొత్తంలో ఆస్తులు సంక్రమించాయి. ఇప్పుడు ఆ ఆస్తి మొత్తం అనుభవించే ఛాన్స్ పవిత్ర లోకేష్ కి దక్కిందట. అడగాలే కానీ తనకు ఏమైనా ఇచ్చే నరేష్ ఉండగా పవిత్ర భారీగానే ఖర్చు చేస్తున్నారట. ముఖ్యంగా ఆమె అందం కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారనే ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
43 ఏళ్ల పవిత్ర లోకేష్ బరువు తగ్గి మరింత యంగ్ అండ్ స్లిమ్ గా కనిపించాలని ఆశపడుతున్నారట. నరేష్ కూడా ఆమె సౌందర్యాన్ని మరింతగా ఆస్వాదించాలని కోరుకుంటున్న తరుణంలో విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారట. పవిత్ర లోకేష్ అందానికి అవసరమైన డైట్, వ్యాయామాలు, ట్రీట్మెంట్, కాస్మొటిక్స్ ఇలా అనేక రకాల సౌందర్య సాధనాల కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారట. అందం కోసం కోట్లు ఖర్చు పెట్టడం ఏంట్రా బాబు.. అని సామాన్యులు షాక్ అవుతున్నారు.

ఇటీవల నరేష్-పవిత్ర విడిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నరేష్ హింట్ ఇచ్చాడు. తాజాగా వీరిద్దరూ కలిసి నటించిన ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ విడుదలైంది. అలీ మరో ప్రధాన పాత్ర చేశాడు. ఆహాలో అక్టోబర్ 28న విడుదలైన ఈ చిత్ర రివ్యూలు చదువు పవిత్ర, నేను రాత్రంతా మేలుకొని ఉన్నామని వెల్లడించారు. అలాగే పవిత్రతో కలిసి దిగిన ఫోటో షేర్ చేశాడు. దీంతో పవిత్రను లోకేష్ వదిలేశారు, మరో నటికి దగ్గరయ్యారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టత వచ్చేసింది.