Pavithra Lokesh First Husband: పవిత్ర లోకేష్ గత వారం రోజులుగా మీడియాలో మారుమ్రోగుతున్న పేరు. నటుడు నరేష్ ని ఆమె రహస్య వివాహం చేసుకున్నారన్న వార్త సంచలనంగా మారింది. అసలు నరేష్, పవిత్ర పెళ్లి చేసుకున్నారా? లేదా? ఒకవేళ చేసుకుంటే ఎందుకు దాచుస్తున్నారు? అనే దానిపై క్లారిటీ లేదు. అయితే వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక నాలుగులో పెళ్లిపై నరేష్ స్పందించడం జరిగింది. అసలు వివాహ వ్యవస్థ అనవసరం. ప్రతి పది మంది జంటల్లో ఆరుగురు విడిపోతున్నారు. సమాజంలో చాలా మంది రెండు మూడు వివాహాలు చేసుకుంటున్నారు. మేము సెలెబ్రిటీలం కాబట్టి మా గురించి అందరూ చెప్పుకుంటున్నారని అన్నారు.

ఇంత మాట్లాడి కూడా పవిత్రతో పెళ్లి జరిగింది? లేనిది? నరేష్ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పవిత్ర మొదటి భర్త ఎవరు? ఆయన ఏం చేస్తూ ఉంటారు? అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఆ వివరాల్లోకి వెళితే… పవిత్ర లోకేష్ భర్త పేరు సుచేంద్ర ప్రసాద్. ఈయన చాలా కాలంగా సినిమా, టెలివిజన్ నటుడిగా ఉన్నారు. సుచేంద్ర రచయిత, దర్శకుడు కూడాను. సుచేంద్ర 2002లో మల్లిక సిన్హా అనే యువతిని పెళ్లాడారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితం తర్వాత మనస్పర్ధలతో 2006లో విడాకులు తీసుకొని విడిపోయారు.
Also Read: Jabardasth Varsha: చావు బ్రతుకుల మధ్య జబర్దస్త్ వర్ష విషాదంలో ఇమ్మానియేల్.. ఇంతకీ ఏం జరిగింది?

అనంతరం పవిత్ర లోకేష్ ని 2007లో రెండో వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఒకే పరిశ్రమలో పనిచేస్తున్న కారణంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరికి ఇద్దరు సంతానం. ఈ మధ్యనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. గత రెండేళ్లుగా వీరు విడివిడిగా ఉంటున్నారు. విడాకులకు కూడా అప్లై చేసినట్లు వినికిడి. భర్తతో దూరమయ్యాక పవిత్ర నటుడు నరేష్ కి దగ్గరయ్యారు. ఆయనతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టారు. నరేష్ ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు ఇప్పిస్తున్నారు. కొన్నాళ్లుగా వీరు కలిసే ఉంటున్నట్లు సమాచారం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ ఐదేళ్ల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో పవిత్ర భర్త సుచేంద్ర గురించి గొప్పగా చెప్పడం విశేషం.
Also Read:Karthika Deepam Doctor Babu: సీరియల్స్ లేక సమాజసేవకు ‘కార్తీకదీపం’ డాక్టర్ బాబు
Recommended Videos
[…] […]