Pavan Kalyan Fans: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఖుషి సినిమా ఎంత ప్రత్యేకమో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు..అప్పట్లో ఈ సినిమా అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలువడమే కాకుండా పవన్ కళ్యాణ్ కి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పరిచింది..ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది..

హిట్స్ మరియు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఈ సినిమా నుండి పెరుగుతూ వెళ్ళింది..అంతతి పేరు తెచ్చిన ఈ సినిమా టైటిల్ ని ఇప్పుడు విజయ దేవరకొండ తన సినిమాకోసం వాడుకుంటున్నాడు..మైత్రి మూవీ మేకర్స్ బ్యానేర్ లో విజయ్ దేవరకొండ మరియు సమంత హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న ఒక్క కొత్త సినిమాకి ఖుషి అనే టైటిల్ ని ఖరారు చేసారు..దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా నిన్న సోషల్ మీడియా లో విడుదల చేసారు..

Also Read: Sohail Khan And Seema Khan: భార్యతో స్టార్ హీరో విడాకులు.. ఆ హీరోయిన్ కోసమేనా?
అయితే తమ అభిమాన హీరో కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా ఒక్క సినిమా పేరు ని నువ్వు వాడుకోవడం ఏమిటి అని పవన్ కళ్యాణ్ అభిమానులు విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు..సినిమా సూపర్ హిట్ అయ్యి మంచి సినిమాగా నిలిస్తే పర్వాలేదు కానీ, ఒక్కేవేళ డిజాస్టర్ అయితే ఆ పేరుకి ఉన్న విలువ పోతుంది అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆరోపిస్తున్నారు..గతం లో కూడా ఇలాగె మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో సెన్సషనల్ హిట్ గా నిలుచున్న గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ ని హీరో నాని వాడుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..
అప్పట్లో చిరంజీవి అభిమానులు నాని పై ఇలాగె విరుచుకుపడ్డారు..ఆ తర్వాత సినిమా టైటిల్ ని నాని గ్యాంగ్ లీడర్ గా మార్చడం తో కాస్త శాంతించారు..ఇప్పుడు విజయ్ దేవరకొండ చెయ్యబోతున్న ఖుషి సినిమా టైటిల్ కూడా అలా మారుస్తారా లేదా అనేది చూడాలి.
Also Read: Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?
Recommended Videos
[…] Also Read: Pavan Kalyan Fans: విజయ్ దేవరకొండ పై విరుచుకుపాడ… […]
[…] Also Read: Pavan Kalyan Fans: విజయ్ దేవరకొండ పై విరుచుకుపాడ… […]
[…] Read:Pavan Kalyan Fans: విజయ్ దేవరకొండ పై విరుచుకుపాడ… Recommended […]