Sohail Khan And Seema Khan: సినీ ఇండస్ట్రీలో చొక్కాలు మార్చినంత ఈజీగా భర్తలు/భార్యలను మార్చేస్తుంటారని ఒక టాక్ ఉంది. అందుకే సినీ స్టార్ల కాపురాలు ఎక్కువ కాలం నిలబడవని అంటుంటారు. సినీ స్టార్లకు ఉండే పరిచయలే వారిని దారితప్పేలా చేసి వివాహేతర సంబంధాలు పెట్టుకునేలా పురిగొల్పుతాయని చరిత్ర చెబుతోంది. సినీ ఇండస్ట్రీలో ప్రేమలు-విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడుతారో అంతే త్వరగా విడిపోతున్నారు.

Sohail Khan And Seema Khan
తాజాగా సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ పరిస్థితి కూడా ఇలానే అయ్యింది. సోహైల్ ఖాన్ విడాకుల విషయం ఇప్పుడు బీటౌన్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న సోహైల్-సీమా ఖాన్ లు 24 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ కోర్టుకు విడాకుల కోసం ఎక్కడ బాలీవుడ్ ను షాక్ కు గురిచేసింది.
Also Read: Kailasa Temple Mystery: మిస్టరీ కైలాస పాతాళ గుడి.. ఎలా నిర్మించారన్నది ఇప్పటికీ అతిపెద్ద రహస్యమే?
ప్రేమించి పెద్దలను ఎదురించి మరీ సోహైల్ ఖాన్-సీమా ఖాన్ లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ వివాహ బంధానికి ముగింపు పలకడం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక కారణం ఏమిటన్న దానిపై బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా ప్రచారం సాగుతోంది.

Sohail Khan And Seema Khan
బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నాడంటూ మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. గతంలోనూ ఇలాంటి వార్తలు రాగా.. సొహైల్ తనకు అన్న లాంటి వాడని చెప్పి హ్యూమా ఖురేషి అందరి నోరూ మూయించింది. మరి ఇప్పుడు ఏకంగా సోహైల్ జంట విడాకులు తీసుకోవడంతో మరోసారి ఈ బ్యూటీ పేరు జోరుగా వినిపిస్తోంది.
Also Read:Kannada TV Actress Chethana Raj: అందం కోసం ప్రాకులాట, ప్రాణాలతో హీరోయిన్ల చెలగాటం !
Recommended Videos