https://oktelugu.com/

Star Heroine: ప్రియుడితో పెళ్లి పీటలు ఎక్కిన స్టార్ హీరోయిన్!

వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాకుండా చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లి కి హాజరయ్యే అందరి మొబైల్ ఫోన్స్ కెమెరాకు ఒక నల్లటి స్టిక్కర్ అంటించారని,

Written By:
  • Shiva
  • , Updated On : September 25, 2023 / 04:46 PM IST
    Follow us on

    Star Heroine: బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా అప్ ఎంపీ రాఘవ చద్దా తాజాగా మూడుముళ్ల బంధంతో ఒకటైయ్యారు. సెప్టెంబర్ 24 న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లీలా ప్యాలెస్ లో వీరిద్దరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు మూడు రోజులుగా జరుగుతున్న వీరి పెళ్లి వేడుకకు తమ బంధు మిత్రులతో పాటు గా అతి కొద్ది మంది సెలెబ్రిటీస్ మాత్రమే హాజరయ్యారు.

    వీరి పెళ్లికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటకు రాకుండా చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. పెళ్లి కి హాజరయ్యే అందరి మొబైల్ ఫోన్స్ కెమెరాకు ఒక నల్లటి స్టిక్కర్ అంటించారని, ఎవరైనా స్టిక్కర్ తీసేసి ఫోటోలు తీస్తే స్టిక్కర్ తీసిన దగ్గర ఇంటూ మార్క్ ఉంటుందని తిరిగి వెళ్లే సమయంలో వాటిని చెక్ చేసి, ఎవరి ఫోన్ కు అయిన ఇంటూ మార్క్ ఉంటే ఆ ఫోన్ ను తనిఖీ చేసి అందులో ఏమైనా పెళ్లి తాలూకా ఫోటోలు, వీడియోలు ఉంటే వాటిని డిలీట్ చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.

    కాకపోతే కొందరు పెద్ద పెద్ద సెలెబ్రిటీస్ కు ఇందుకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పెళ్ళికి పలువురు సినీ, రాజకీయ , క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ , పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ , ఆదిత్య ఠాక్రే , అప్ ఎంపీ సంజయ్ సింగ్ ,మనీష్ మల్హోత్రా , హర్భజన్ సింగ్ , సానియా మీర్జా లాంటి వాళ్ళు హాజరయ్యారు. అయితే ఈ పెళ్ళికి బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హాజరుకాలేదు.

    పరిణితి చోప్రా, రాఘవ చద్దా కు విషెస్ చెబుతూ మాత్రం ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పెళ్ళికి ఆమె తల్లి డాక్టర్ మధు చోప్రా హాజరయ్యారు. ఒక వీరి పెళ్లి రిసెప్షన్ ను సెప్టెంబర్ 30 న చండీగఢ్ లో , ఆ తర్వాత ఢిల్లీలో మరో రిసెప్షన్ వేడుక జరగబోతుంది. ఈ వేడుకలకు బాలీవుడ్ నటీనటులతో పాటు గా ప్రముఖ రాజకీయ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఇక వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఎక్కడ కూడా కనిపించకపోవడంతో అధికారికంగా ఎప్పుడు విడుదల చేస్తారని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.