పరేశ్ రావల్ అంటే చిన్న నటుడు ఏమి కాదు, చాల పెద్ద నటుడు, అలాంటి నటుడి విషయంలో కూడా మీడియా అశ్రద్ధగా ఎలా వార్తలు రాస్తోంది అంటూ మీడియా పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. అసలు ఈ వార్త ఎలా పుట్టింది అంటే.. నిన్న ఉదయం 7 గంటలకు పరేశ్ రావల్ చనిపోయినట్లుగా ట్విటర్ లో ఓ నెటిజన్ మెసేజ్ పెట్టాడు. అది చూసి కొన్ని బాలీవుడ్ వెబ్ సైట్స్ పరేశ్ చనిపోయాడని, ఆయన కండిషన్ సీరియస్ గా ఉందని వార్తలు రాసుకొచ్చాయి.
అయితే ఆ వార్తలు చూసిన పరేశ్ రావల్ తన మరణ వార్త పై చమత్కరంగా స్పందించారు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘నేను చనిపోయానని మీకు అపోహ కలిగించిందుకు నన్ను మన్నించగలరు. ఉదయం 7 దాటాకా కూడా నేను ఎక్కువ సమయం నిద్రపోయానంతే. అయితే మీరు అపోహ పడినట్టు నేను చనిపోలేదు’ అంటూ చేతులు జోడించిన ఎమోజీలను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు.
అసలు ఇలాంటి వార్తలను సరిచూసుకోకుండా ఎలా రాస్తారు ? ఇలాంటి తప్పుడు ప్రచారాల పై చట్టపరమైన చర్యలు తీసుకొవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయినా ఇలాంటి పుకార్లు రెగ్యులర్ గా పుట్టిస్తూనే ఉంటారు. ఆ మధ్య ప్రముఖ సింగర్ లక్కీ ఆలీ చనిపోయినట్టు రాసుకొచ్చారు. రీసెంట్ గా నటుడు ముఖేష్ కన్నా కోవిడ్‌తో మరణించినట్లు వార్తలు పుట్టించారు. ఇప్పటికైనా ఇలాంటి వార్తలు రాసేముందు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది.