Parasakthi: కోలీవుడ్ లో స్టార్ హీరో లీగ్ కి అతి చేరువలో ఉన్న హీరో ఎవరు అని అడిగితే, అక్కడి ఆడియన్స్ చెప్పే పేరు శివ కార్తికేయన్(Sivakarthikeyan). టీవీ యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు సంపాదించి, చిన్నగా హీరోగా మారి వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ, నేడు తమిళనాడు లో రజినీకాంత్, విజయ్, అజిత్ తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న హీరో గా శివ కార్తికేయన్ కొనసాగుతున్నాడు. ‘అమరన్’ చిత్రం తో ఏకంగా 370 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన శివ కార్తికేయన్ కి, ఇక తిరుగేలేదని అంతా అనుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన హీరో గా నటించితిన్ ‘మదరాసి’ అనే చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ గా నిల్చింది. ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘పరాశక్తి’ అనే చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలైంది.
వాస్తవానికి ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ ‘జన నాయగన్’ చిత్రం కూడా విడుదల అవ్వాలి. కానీ సెన్సార్ బోర్డు ఆ చిత్రానికి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించడం, ఆ తర్వాత మూవీ టీం హై కోర్టు కి వెళ్లడం, తుది తీర్పు రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడం తో మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. ఇక ‘పరాశక్తి’ చిత్రానికి సోలో సంక్రాంతి దొరికింది, బాక్స్ ఆఫీస్ వద్ద శివ కార్తికేయన్ మరోసారి 300 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఆ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి కనీసం 80 కోట్ల గ్రాస్ వసూళ్లు కూడా రాలేదు. అయితే ఈ సినిమాని ముందుగా శివ కార్తికేయన్, జయం రవి లతో చెయ్యాలని అనుకోలేదట.
ముందుగా సూర్య , దుల్కర్ సల్మాన్ లతో ఈ చిత్రాన్ని చెయ్యాలని అనుకున్నారట. కానీ వీళ్లిద్దరికీ కథ నచ్చలేదు. ఈ చిత్ర డైరెక్టర్ సుధా కొంగర గతం లో సూర్య తో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా నేరుగా ఓటీటీ లో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. తనతో అంత మంచి సినిమా తీసినప్పటికీ సూర్య ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకోలేదు. ఇందులో జయం రవి క్యారక్టర్ ని సూర్య, దుల్కర్ సల్మాన్ క్యారక్టర్ ని శివ కార్తికేయన్ చేశారు. అసలే ఫ్లాప్స్ లో ఉన్న సూర్య ఇలాంటి సినిమాని చేసుంటే కెరీర్ రిస్క్ లో పడేది. మంచిగా తప్పించుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
