Paradise vs Rowdy Janardhana: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. చాలామంది హీరోలు పక్కా వాళ్ళు ఏ సినిమాలు చేస్తున్నారు మనం ఎలాంటి సినిమాలు చేయాలి అని ఆలోచిస్తుంటారు. వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ప్రస్తుతం నాని సైతం కేర్ ఫుల్ గా ముందుకు సాగుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. వీళ్ళ కాంబినేషన్లో ఇంతకు ముందు ‘దసర’ అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది. మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఏర్పడుతున్నాయి… మొదటి నుంచి కూడా నానితో పోటీ పడుతూ వస్తున్న విజయ్ దేవరకొండ ప్యారడైజ్ సినిమా లానే రా అండ్ బోల్డ్ గా ఉండేలా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో వస్తున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమాలో ఆయన చాలా వైలెంట్ గా కనిపించబోతున్నాడనేది తెలుస్తోంది. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ లో విజయ్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేశారు. ప్యారడైజ్ సినిమాకి రౌడీ జనార్ధన్ మూవీకి దగ్గర పోలికలు ఉన్నాయి.
నిజానికి శ్రీకాంత్ ఓదెల మొదట దసర సినిమాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించాలని చూశాడు. కానీ విజయ్ మాత్రం ఆ కథను రిజెక్ట్ చేయడంతో నాని దగ్గరికి వెళ్లి అతనితో సినిమా చేసి సూపర్ సక్సెస్ సాధించాడు… ఇక నానికి శ్రీకాంత్ కి మంచి ర్యాపో కుదరడం వల్ల తన తదుపరి సినిమాని సైతం నాని తో చేయాలనే ఉద్దేశ్యంతో ప్యారడైజ్ సినిమాని స్టార్ట్ చేశారు.
ఇక ఈ సినిమా మార్చి నెలలో రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకునే దిశగా ముందుకు దూసుకెళ్తున్నారు… ఇక ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు వస్తే మాత్రం సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తుండటం విశేషం…ఇక శ్రీకాంత్ ఓదెల విజయ్ దేవరకొండ కి మధ్య ఎలాంటి గొడవ జరగకపోయిన కూడా తను చెప్పిన దసర కథను విజయ్ రిజెక్ట్ చేశారనే ఉద్దేశ్యంతో శ్రీకాంత్ ఉన్నాడట.
ఇక ఆ తర్వాత విజయ్ పిలిచి ఒక సినిమా చేద్దామని అడిగిన కూడా శ్రీకాంత్ మాత్రం దానికి రెస్పాండ్ అవ్వలేదంట. మొత్తానికైతే ప్యారడైజ్ vs రౌడీ జనార్ధన్ నాని వర్సెస్ విజయ్ దేవరకొండ మధ్య పోటీ కాకుండా శ్రీకాంత్ ఓదెల వర్సెస్ విజయ్ దేవరకొండ మధ్య పోటీగా మారబోతోంది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…