Paradise
Paradise : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. మీడియం రేంజ్ హీరోలు సైతం భారీ సక్సెస్ ని అందుకొని స్టార్ హీరోలుగా గుర్తింపును తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే నాని తనకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా అభిమానులందరిని అలరిస్తున్నాడు. ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ గా ఆడుతాయనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంటుంది…
Also Read : ప్యారడైజ్ సినిమా లో ఆ స్టార్ హీరో విలన్ గా నటిస్తున్నాడా..?
సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక నాని లాంటి హీరో తనదైన రీతిలో వరుసగా సినిమాలు చేస్తు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికే దసర (Dasara), హాయ్ నాన్న (Hai Nanna), సరిపోదా శనివారం (Saripodha Shanivaaram) సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో కొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్యారడైజ్ (Paradaise) అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేశారు. ప్రేక్షకులందరి నుంచి మంచి ఆదరణ పొందిన ఈ గ్లింప్స్ తో ఇండియా వైడ్ గా మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చి 26వ తేదీన రిలీజ్ కి రెడీ అవ్వనుంది. ఆ డేట్ ఈ రోజుకి సరిగ్గా సంవత్సరం ఉంది.
ఇక ఇదే విషయాన్ని నాని గుర్తు చేస్తూ తన ఎఫ్ బి అకౌంట్ లో ఈ సినిమా రిలీజ్ కి 365 రోజులు (సంవత్సరం) ఉంది అంటూ ఒక పోస్టర్ ను అయితే పోస్ట్ చేశాడు. ఇక ఈ పోస్టర్ లో నాని రెండు జడలు వేసుకొని ఒక డిఫరెంట్ గెటప్ లో గన్ ను భుజానికి ఎత్తుకొని ఉన్నాడు. వెనక నుంచి నానిని చూస్తేనే భీభత్సం జరుగుతుంది. ఇక ముందు నుంచి చూస్తే ప్రళయమే… ఈ సినిమాలో నాని చాలా వైల్డ్ లుక్ లో కనిపించడమే కాకుండా ఒక పెద్ద యుద్ధం కూడా చేయబోతున్నాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది… ఇది ఒక అణగారిన తెగకి చెందిన కథ. మరి ఇందులో నాని ఎవరి మీద పోరాటం చేస్తాడు. ఎవరికి న్యాయాన్ని అందిస్తాడు. అతని చేతి మీద ఉన్న టాటు తో ఏం చెప్పదల్చుకున్నాడు అనేది తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నాని భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి.
మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాని తెరకెక్కించి భారీ సక్సెస్ ని సాధిస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా ఒక అల్టిమేట్ విజయాన్ని సాధిస్తుందని వాళ్ళ అభిమానులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన దసర (Dasara) సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి నానికి మొదటిసారి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాగా హిస్టరీలో నిలిచిపోయింది. మరి ఈ సినిమాతో ఎన్ని వందల కోట్ల కలెక్షన్లు రాబడతారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : ‘ది ప్యారడైజ్’ మూవీలో లో నాని మదర్ గా నటిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?