Homeఎంటర్టైన్మెంట్Papam Pratap Review: 'పాపం ప్రతాప్ ' ఫుల్ మూవీ రివ్యూ...

Papam Pratap Review: ‘పాపం ప్రతాప్ ‘ ఫుల్ మూవీ రివ్యూ…

Papam Pratap Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా కొంతమంది తక్కువ బడ్జెట్ తో ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే గత సంవత్సరం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన తిరువీర్ ‘పాపం ప్రతాప్’ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా భారీ ఎత్తున నిర్వహించడంతో సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఈ సినిమా ఈరోజు రిలీజ్ అవ్వనున్న నేపద్యంలో నిన్న నైట్ నుంచే ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ వేశారు. ఇక ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించింది లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ప్రతాప్ (తిరువీర్) అనే వ్యక్తికి తన చిన్నతనం నుంచే బుజ్జమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుంది. తన ఇష్టాన్ని ప్రేమ గా మార్చుకొని మొత్తానికైతే తన బుజ్జమ్మ ను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లైన మూడు రాత్రుల తర్వాత బుజ్జమ్మ పంచాయతీ పెట్టి ప్రతాప్ కి నిద్ర లో కలవరించే అలవాటు ఉంది.

ఆయన ఆ అలవాటు మానుకునేంత వరకు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి తను ఉన్నపళంగా వెళ్ళిపోతుంది…ఇక తన భార్య ను దక్కించుకోవడానికి ప్రతాప్ నిద్ర లో కలవరించే అలవాటు ను మార్చుకున్నాడా? ఫైనల్ గా బుజ్జమ్మ ప్రతాప్ దగ్గరికి వచ్చిందా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు మొదటి నుంచి కూడా ఈ సినిమాని ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలనే ప్రయత్నం చేశాడు. హీరో ఎదుర్కొంటున్న ప్రాబ్లం ను ముందుగానే ఎస్టాబ్లిష్ చేసి ప్రతి సన్నివేశాన్ని కామెడీ గా నడిపించే ప్రయత్నం చేశాడు. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయినప్పటికి మరికొన్ని చోట్ల మాత్రం అంత పెద్దగా అనిపించలేదు… ప్రతి సన్నివేశంలో ఏదో ఒక ఎమోషన్ ను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా దర్శకుడు తీర్చి దిద్దే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే కొన్ని కామెడీ సన్నివేశాలను చాలా బాగా తెరకెక్కించిన దర్శకుడు ఎమోషనల్ సన్నివేశాల విషయంలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది.

ముఖ్యంగా సినిమా లో కొన్ని సన్నివేశాలను డిలీట్ చేసి ఉంటే ఇంకా అద్భుతంగా వచ్చిండేది… ఇక సినిమాలోని ఎమోషన్ కి తగ్గట్టుగా సురేష్ బొబ్బిలి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంతో సినిమా ఓవరాల్ గా బావుంది. ఫస్టాఫ్ కాస్త డల్ అయినప్పటికి సెకండాఫ్ మాత్రం చాలా బాగా సెట్ చేశారు…ఇక క్లైమాక్స్ కూడా ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది…పాటలు సినిమా చూస్తున్నప్పుడు ఓకే అనిపించినప్పటికి సినిమా అయిపోయిన తరువాత చూస్తే అందులో ఒక్క పాట కూడా గుర్తుకులేవు… భార్య భర్తల మధ్య ఎలాంటి అండర్ స్టాండింగ్ ఉండాలనే విషయాన్ని చెప్పిన ప్రతిసారి డైలాగ్స్ బాగా సెట్ అయ్యాయి…

ఆర్టిస్టుల పర్ఫామెన్

తిరువీర్ తన గత సినిమా మాదిరిగానే ఈ మూవీలో కూడా చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చాడు…హీరోయిన్ సైతం ఆయనకి సపోర్ట్ చేస్తూ తన పాత్ర కి న్యాయం చేసింది…ఇక అజయ్ ఘోష్ తన యాక్టివిటీస్ తో ప్రేక్షకులకు నవ్వు తెప్పించాడు. ఇక గోపరాజు రమణ సైతం చాలా చక్కటి కామెడీ ని పండించాడు. ముఖ్యంగా థియేటర్ లో ఉండే సన్నివేశానికి ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు…ఇక ప్రసాద్ బెహరా ఈ సినిమాకి చల్ హెల్ప్ అయ్యాడు. సెకండాఫ్ లో ఆయన చాలా సీన్స్ లో ప్రేక్షకులను నవ్వించాడు. మిగిలిన పాత్రల్లో నటించనవలు సైతం సినిమా కి చాలా బాగా హెల్ప్ అయ్యారు…

టెక్నికల్ అంశాలు…

సురేష్ బొబ్బిలి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది…అలాగే రెండు సాంగ్స్ కూడా పర్లేదు అనిపించాయి… ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెబితే మీకే ఇంకా గ్రిప్పింగ్ గా వచ్చేది…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి…

ఈ మూవీలో బాగున్నవి…

కామెడీ సీన్స్
సెకండాఫ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్

ఈ మూవీలో బాగోలేనివి…

ఫస్టాఫ్
సాంగ్స్

రేటింగ్ : 2.5/5

పిల్లలతో కలిసి చూడాలనుకునేవాళ్లకి ఈ సినిమాను ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చు….

 

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular