Punch Prasad : పంచ్ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించిన విషయం తెలిసిందే. ఆయనకు అర్జెంట్ గా ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఖరీదైన వ్యవహారం కావడంతో పంచ్ ప్రసాద్ మిత్రులు సోషల్ మీడియా క్యాంపేన్ నిర్వహించారు. పంచ్ ప్రసాద్ కి ఆపరేషన్ దయచేసి ఆదుకోవాలంటూ వేడుకున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ఆంధ్రప్రదేశ్ సిఎంఓ దృష్టికి పంచ్ ప్రసాద్ పరిస్థితి తీసుకెళ్లారు. ట్విట్టర్ వేదిక ఏపీ సిఎంఓని అభ్యర్థించడం జరిగింది. సీఎం వైఎస్ జగన్ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ హరి కృష్ణ వెంటనే స్పందించారు. ఆయన వివరణ ఇచ్చారు.
పంచ్ ప్రసాద్ కుటుంబ సబ్యులతో మా టీం ఆల్రెడీ టచ్ లో ఉన్నారు. అవసరమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అది పూర్తయిన వెంటనే ఆపరేషన్ కి కావాల్సిన ఏర్పాటు ప్రభుత్వం కలిపిస్తుందని ట్వీట్ చేశారు. దీంతో పంచ్ ప్రసాద్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు సరైన చికిత్స అంది, తిరిగి కోలుకుని తమకు హాస్యం పంచాలని కాంక్షితున్నారు.
చాలా కాలంగా పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా పంచ్ ప్రసాద్ తరచుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆమె మధ్య వెనుక సమస్య వచ్చింది. నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఇటీవల ఆయనకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఈ విషయాన్ని పంచ్ ప్రసాద్ భార్య స్వయంగా వెల్లడించారు. కిడ్నీ తాను ఇవ్వదలచుకుంటే డాక్టర్స్ వద్దన్నారని, డోనర్ ఉన్నాడు కాబట్టి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన కొద్దిరోజులకే పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మరలా క్షీణించింది.
పంచ్ ప్రసాద్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ తోటి కమెడియన్స్ మద్దతు ఇస్తున్నారు. ఆయనను జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో భాగం చేస్తున్నారు. అలా వచ్చిన డబ్బులతో వైద్యం చేయించుకుంటున్నాడు. తాజాగా పరిస్థితి సీరియస్ గా మారడంతో ఆపరేషన్ చేయాలన్నారట. అందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని పంచ్ ప్రసాద్ వేడుకోగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం ఆదుకోనుంది.