https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ 8′ గ్రాండ్ ఫినాలే కి ముఖ్య అతిథిగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్..ఫ్యాన్స్ కి ఇక కనుల పండుగే!

మూడు సీజన్స్ నుండి ఫినాలే ఎపిసోడ్స్ కి ఎలాంటి అతిథులు రాలేదు. ఇప్పటి వరకు ఫినాలే ఎపిసోడ్స్ కి విక్టరీ వెంకటేష్ ఒకసారి వచ్చాడు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి సీజన్ 3 నుండి సీజన్ 5 వరకు ఫినాలే ఎపిసోడ్స్ కి గెస్ట్ గా వచ్చాడు. సీజన్ 6 నుండి ఎందుకో ఎవరినీ పిలవలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : December 1, 2024 / 04:41 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  అట్టహాసం గా మొదలైన ‘బిగ్ బాస్ 8’ ఎన్నో ట్విస్టులు, టర్నులతో ముందుకు సాగుతూ ఇప్పుడు చివరి దశకి చేరుకుంది. ప్రారంభంలో పూర్తిగా గాడి తప్పి డిజాస్టర్ వైపు దూసుకుపోతున్న ఈ సీజన్ ని, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తో మళ్ళీ గాడిలో పడింది. వాళ్ళు పంచిన ఎంటర్టైన్మెంట్, ఆడిన టాస్కులు, ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆడియన్స్ కి నచ్చింది. ముఖ్యంగా వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్ కృష్ణ గేమ్ ని మొత్తం మార్చేసి, గేమ్ చేంజర్ గా నిలిచాడు. ఇతను వచ్చిన తర్వాతనే హౌస్ లో గ్రూప్ గేమ్ మాఫియాలు బట్టబయలు అయ్యాయి. పాత కంటెస్టెంట్స్ ఇతన్ని తొక్కడానికి వేసిన కుయుక్తులు, అడుగడుగునా ఇతన్ని తొక్కేందుకు చేసిన ప్రయత్నాలు, నామినేషన్స్ సమయంలో హౌస్ మేట్స్ అందరూ ఇతన్ని టార్గెట్ చేయడం ఇవన్నీ అన్యాయంగా అనిపించాయి. అందుకే ఆయనకి భారీ స్థాయిలో ఓట్లు వేసి టైటిల్ రేస్ లో నిల్చోబెట్టారు ప్రేక్షకులు.

    కేవలం గౌతమ్ మాత్రమే కాదు..అవినాష్ ,రోహిణి,టేస్టీ తేజ వంటి వారు అందించిన ఎంటర్టైన్మెంట్ ఈ సీజన్ విజయవంతం అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గా నిల్చింది. కేవలం ఎంటర్టైన్మెంట్ విషయం లో మాత్రమే కాదు, టాస్కులు ఆడడంలో కూడా వీళ్ళు శబాష్ అనిపించుకున్నారు. కమెడియన్స్ టాస్కులు ఆడలేరు, విన్నర్స్ అవ్వలేరు అని వచ్చే వాదనలకు ఈ బ్యాచ్ ఫులుస్టాప్ పెట్టి టాప్ 5 లోకి చేరారు. ఇక పాత కంటెస్టెంట్స్ లో నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణు ప్రియ వంటి వారు కూడా బోలెడంత కంటెంట్ ఇచ్చారు. వీరిలో గత వారం యష్మీ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం పృథ్వీ ఎలిమినేట్ అయ్యాడు. ఇలా వరుసగా ఓజీ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. వచ్చే వారం కూడా వీరిలోనే ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    ఇదంతా పక్కన పెడితే గత మూడు సీజన్స్ నుండి ఫినాలే ఎపిసోడ్స్ కి ఎలాంటి అతిథులు రాలేదు. ఇప్పటి వరకు ఫినాలే ఎపిసోడ్స్ కి విక్టరీ వెంకటేష్ ఒకసారి వచ్చాడు. అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి సీజన్ 3 నుండి సీజన్ 5 వరకు ఫినాలే ఎపిసోడ్స్ కి గెస్ట్ గా వచ్చాడు. సీజన్ 6 నుండి ఎందుకో ఎవరినీ పిలవలేదు. కానీ ఈ సీజన్ కి మాత్రం ఫినాలే లో ముఖ్య అతిథి కచ్చితంగా వస్తారట. ఆ అతిథి మరెవరో కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఆయన హీరో గా నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమాకి ప్రొమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ ఇక్కడికి రాబోతున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం లో దీని గురించి అధికారిక ప్రకటన రాబోతుందట.