The Paradise: గత కొంత కాలం క్రితం ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై వచ్చిన రూమర్స్ అభిమానులను కలవరానికి గురి చేశాయి. ప్రశాంత్ నీల్ తీసిన ఔట్పుట్ పై ఎన్టీఆర్ అసంతృప్తి గా ఉన్నాడని, ప్రశాంత్ నీల్ కి కూడా ఆ సన్నివేశాలు నచ్చలేదని, అందుకే తీసిన ఔట్పుట్ మొత్తాన్ని తొలగించి, షూటింగ్ ఆపేసి, స్క్రిప్ట్ ని మరోసారి కొత్తగా రాస్తున్నారు అంటూ ప్రచారం సాగింది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియక అభిమానులు అసలు ఏమి జరుగుతుందో అర్థం కాక, మెంటలెక్కిపోయారు. ఆ ప్రచారం లో ఎంతో కొంత నిజముంది అనేది వాస్తవమే. ఆ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే, రీసెంట్ గా మరో పాన్ ఇండియన్ సినిమా కూడా ఇదే తరహా సమస్యలను ఎదురుకుంటుందట. ఆ పాన్ ఇండియన్ సినిమా ఏంటో బయటకు చెప్పడం లేదు కానీ, ఆ చిత్ర డైరెక్టర్ ఇప్పటి వరకు తీసిన ఔట్పుట్ పై ఏ మాత్రం సంతృప్తి గా లేడని తెలుస్తోంది.
అందుకే తీసిన ఫుటేజీ లో అత్యధిక శాతం తొలగించి మళ్లీ కొత్తగా తియ్యాలని చూస్తున్నారట. అందుకు నిర్మాతను బడ్జెట్ పెట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం, నిర్మాత అందుకు ససేమీరా నో చెప్పడం జరిగింది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా వరకు నిన్ను నమ్మి బడ్జెట్ ఖర్చు చేసాము, ఇప్పుడు ఈ ఔట్పుట్ నీకే నచ్చడం లేదని అంటున్నావు, అవతల నేను బిజినెస్ ని కూడా ప్రారంభించేసాను, ఇప్పుడు నేను చేసేది ఏమి లేదు , ఏమి తీస్తావో తియ్యి నీ ఇష్టం, రీ షూటింగ్ కి మాత్రం బడ్జెట్ ఇచ్చే సమస్యే లేదని నిర్మాత చెప్పినట్టు సమాచారం. ఇంతకీ ఆ పాన్ ఇండియన్ భారీ బడ్జెట్ సినిమా ఏంటి?, ఎవరు ఈ చిత్రానికి దర్శకుడు?, ఎవరు హీరో?, ఎవరు నిర్మాత వంటివి తెలియాల్సి ఉంది.
వచ్చిన ఈ సమాచారం ప్రకారం చూస్తుంటే ఇది కచ్చితంగా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం గురించే అయ్యుంటుందని అంటున్నారు నెటిజెన్స్. గతంలో కూడా ఈ చిత్రం గురించి ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కానీ వాటిని నమ్మలేదు. ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయినా ఈ వార్త చూస్తుంటే కచ్చితంగా ఇది ప్యారడైజ్ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని తో పాటు, సుధాకర్ చెరుకూరి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మార్చి 26 న ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కానీ అప్పటికి షూటింగ్ పూర్తి అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఇప్పట్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపించడం లేదు.