Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ఓ రేంజ్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ప్రభాస్… తెలుగు సినిమా ఖ్యాతిని భారతదేశ వ్యాప్తంగా చాటాడు. దీంతో హీరో ప్రభాస్ దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు ప్రభాస్. కాగా ప్రభాస్ – అనుష్క ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Also Read: కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం… దిగ్గజ నటుడు శివరామ్ మృతి
బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో వారి కెమిస్ట్రీని చూసి ప్రేక్షకులు ప్రశంసలు అందించారు. అయితే ఆఫ్ స్క్రీన్‌లోనూ వారు కలిసి మెలిసి ఉండాలని సినీ అభిమానులు కోరుకుంటారు. వీరిరువురి మధ్య ప్రేమ కూడా ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని సంవత్సరాలు గా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అవి వాస్తవం కాదంటూ వారు ఆ వార్తలను కొట్టిపారేశారు. ఇప్పుడు తాజాగా ప్రభాస్ చేసిన ఓ పని గురించి సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి ప్రభాస్ కు వీరాభిమాని. తన అభిమాన హీరో ప్రభాస్‌ను ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి తన కూతురికి మంచి పేరు పెట్టాలని అడిగాడట.
అప్పుడు ప్రభాస్ వెంటనే అనుష్క అని పెట్టాలని, ఆమె అంత మంచితనం పాపకు రావాలని ప్రభాస్ దీవించాడని తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న అనుష్క కూడా బాగా ఎమోషనల్ అయ్యారని సమాచారం. అనుష్క – ప్రభాస్ మధ్య బలమైన బంధం అయితే ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ… ‘శభాష్ మిథూ’ రిలీజ్ ఎప్పుడంటే ?