Tasty Teja: టేస్టీ తేజపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేసిన ఘటన చర్చకు దారి తీసింది. పోలీసుల ఎంట్రీతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ తెలుగు 7 పదవ వారంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్లో శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, అశ్విని, అర్జున్, భోలే, ప్రియాంక, శోభా, యావర్, రతిక, గౌతమ్ ఉన్నారు. 9వ వారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. రతిక, తేజ డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది.
రతిక కంటే తక్కువ ఓట్లు వచ్చిన తేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున చెప్పారు. టేస్టీ తేజ ఎలిమినేషన్ తో హౌస్లో 11 మంది మాత్రమే మిగిలారు. ఎలిమినేట్ అయిన టేస్టీ తేజకు వెల్కమ్ ఇచ్చేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానులు పెద్ద మొత్తంలో గుమిగూడారు. తేజ ఓపెన్ టాప్ కార్ లో ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ ర్యాలీ చేశాడు. ఏ క్రమంలో ఓ షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది.
అక్కడే పొంచి ఉన్న పల్లవి ప్రశాంత్ అభిమానులు టేస్టీ తేజ మీద దాడికి ప్రయత్నం చేశారు. ఊహించని ఈ ఘటనతో టేస్టీ తేజ కంగుతిన్నాడు. తేజ-పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పేలా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీసులు గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారట. మీడియా మీద కూడా తేజ అసహనం ప్రదర్శించినట్లు సమాచారం.
అనంతరం మీడియాతో మాట్లాడిన తేజను సందీప్ తో వివాహం గురించి మాట్లాడారు. మీ వల్లే ఎలిమినేట్ అయ్యానని సందీప్ అంటున్నాడు. దీనిపై మీ కామెంట్ ఏంటని అడగ్గా…నా వల్ల సందీప్ ఎలిమినేట్ కాలేదు. ఆయన ఏమన్నారో నాకు తెలియదు. ఆయన్ని కలిసి ఒక వీడియో విడుదల చేస్తాను అన్నారు. హౌస్లో ఎవరు ఫేక్? అడగ్గా… ఎవరు ఫేక్ కాదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తిస్తారని తేజ అన్నాడు. తేజను శుభశ్రీ కలిశారు.
Tasty Teja and Aata Sandeep Interview to solve that Sandeep Nomination #BiggBossTelugu #aatasandeep #tastyteja #BiggBoss #BiggBossTelugu #biggboss7telugu #biggbosstelugu7 #comedyvideo pic.twitter.com/1dkvOgn0NW
— Swetha Kamakshi Reviewer (@SwethaTalks) November 6, 2023