Bigg Boss 7 Telugu Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు 7 ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. బుధవారం ఎపిసోడ్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏకంగా ఐదు వారాలు ఎలిమినేషన్ నుండి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఇచ్చాడు. 14 మంది కంటెస్టెంట్స్ లో ఒకరు ఈ ఛాన్స్ దక్కించుకోవచ్చు. దీని కోసం మీరు పోరాడాల్సి ఉందని చెప్పాడు. ఫేస్ ద బీస్ట్ అనే టాస్క్ ఏర్పాటు చేయడమైనది. కంటెస్టెంట్స్ కండలు తిరిగిన కుస్తీ ఆటగాళ్లతో పోటీపడాల్సి ఉంటుంది. అమ్మాయిలు పోటీ పడేందుకు లేడీ పహిల్వాన్ ని అబ్బాయిల కోసం మేల్ పహిల్వాన్ ని రంగంలోకి తెచ్చారు.
వారితో రింగ్ లో పోరాడాలి. అత్యధిక సమయం ఓడిపోకుండా ఉన్నవారు నెక్స్ట్ రౌండ్ కి వెళతారు. ఫేస్ ద బీస్ట్ లో చాలా మంది కంటెస్టెంట్స్ చేతులు ఎత్తేశారు. కనీసం నిమిషం సమయం కూడా రింగ్ లో ఉండలేకపోయారు. కండల వీరుడు ప్రిన్స్ యావర్ సత్తా చూపిస్తాడు అనుకుంటే, అతడు మిగతా వాళ్ళకంటే దారుణంగా ఓడిపోయాడు. ముగ్గురు కంటెస్టెంట్స్ మాత్రమే టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. అబ్బాయిల్లో ఆట సందీప్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్, అమ్మాయిల్లో ప్రియాంక సింగ్ నిమిషానికి పైగా పోరాడారు.
ప్రియాంక సింగ్ 1.7 నిమిషాలు రింగ్ లో ఉంది. ఆట సందీప్ అత్యధికంగా 1.48 సెకండ్స్ పోరాడాడు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 1.43 నిమిషాలు ఫైట్ చేశాడు. దీంతో నెక్స్ట్ రౌండ్ కి అబ్బాయిల నుండి ఆట సందీప్, అమ్మాయిల నుండి ప్రియాంక వెళ్లారు. 5 సెకండ్స్ తేడాతో పల్లవి ప్రశాంత్ నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ఛాన్స్ కోల్పోయాడు.
నెక్స్ట్ రౌండ్ లో ఆట సందీప్, ప్రియాంక సింగ్ పోటీపడతారు. వీరిలో గెలిచిన వారికి 5 వారాల ఇమ్యూనిటీ లభిస్తుంది. అంటే వారిని ఎవరూ నామినేట్ చేయడానికి వీలుండదు. ఐదు వారాలు అంటే చిన్న విషయం కాదు. ఇది పెద్ద ఆఫర్ అని చెప్పొచ్చు. మరి ఆట సందీప్, ప్రియాంక సింగ్ లలో ఎవరు ఆ ఛాన్స్ దక్కించుకుంటారో చూడాలి. ఈ వారానికి షకీలా, శోభిత శెట్టి, గౌతమ్ కృష్ణ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్, దామిని, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్ నామినేషన్స్ లో ఉన్నారు.