https://oktelugu.com/

BB Utsavam: కోర్టు బయట పడుకున్న నాన్నను చూసి ఇంకా ఎందుకు బ్రతికున్నాను అనిపించింది… కన్నీరు మున్నీరైన రైతుబిడ్డ

పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం చేశారు. ఫినాలే జరిగిన రాత్రి బిగ్ బాస్ షో అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 15, 2024 / 01:15 PM IST
    Follow us on

    BB Utsavam: బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. భారీ టీఆర్పీ రాబట్టింది. మేకర్స్ సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే వివాదాలు చుట్టుముట్టాయి. కంటెస్టెంట్స్ అభిమానుల అత్యుత్సాహం షో మీద మరింత నెగిటివిటీకి కారణమైంది. ఇప్పటికే బిగ్ బోస్ షో రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటీషన్లు వేస్తున్నారు. సిపిఐ నారాయణ అయితే… బిగ్ బాస్ హౌస్ ని బ్రోతల్ హౌస్ అని సెన్సేషనల్ ఆరోపణలు చేశారు. హోస్ట్ నాగార్జునను సైతం సిపిఐ నారాయణ ఏకిపారేశారు. సాంప్రదాయవాదులు బిగ్ బాస్ ని వ్యతిరేకిస్తున్నారు.

    పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ ఫ్యాన్స్ కొట్లాటకు దిగారు. పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ నాశనం చేశారు. ఫినాలే జరిగిన రాత్రి బిగ్ బాస్ షో అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. అమర్ దీప్ పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. కారుని అడ్డుకుని అద్దాలు పగలగొట్టారు. ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొంది. పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి రహస్యంగా పోలీసులు బయటకు పంపేశారు. పోలీసుల సూచనలు లెక్కచేయకుండా పల్లవి ప్రశాంత్ తిరిగి వచ్చి ర్యాలీ చేశారు.

    లా అండ్ ప్రాబ్లమ్ కి కారణమైన పల్లవి ప్రశాంత్ మీద అరెస్ట్ వారంట్ జారీ అయింది. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని స్వగ్రామంలో పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ కి తరలించారు. రెండు రోజుల తర్వాత పల్లవి ప్రశాంత్ బెయిల్ పై విడుదలయ్యాడు. అరెస్ట్ తర్వాత మొదటిసారి పల్లవి ప్రశాంత్ ఈ ఘటనపై ఓపెన్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ బీబీ ఉత్సవ్ లో స్పెషల్ ఈవెంట్లో పాల్గొన్నాడు.

    తన అరెస్ట్ సమయంలో తండ్రి పడ్డ కష్టాలను తలచుకుని కన్నీరు మున్నీరు అయ్యాడు. బిగ్ బాస్ టైటిల్ కొట్టి బాపు కళ్ళలో సంతోషం చూడాలని అనుకున్నాను. కానీ ఆయన కోర్టు బయట పడుకున్న వీడియో చూసి, నేనేనా ఇంకా బ్రతికి ఉంది అనిపించింది. మస్తు బాధనిపించింది… అని భావోద్వేగానికి గురయ్యాడు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కప్పు కొట్టిన ఆనందాన్ని ఆస్వాదించకుండా పల్లవి ప్రశాంత్ జైళ్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.