Bigg Boss 7 Telugu: కష్టపడే వాళ్ళను కామెడీ చేయాలని చూస్తే మనకే బొక్క పడుతుంది. పల్లవి ప్రశాంత్ సింపథీ గేమ్ ఆడుతున్నాడంటూ అతన్ని టార్గెట్ చేసిన అమర్ దీప్ ని సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. సెకండ్ వీక్ నుండే పల్లవి ప్రశాంత్ పట్ల అమర్ దీప్ బ్యాడ్ బిహేవియర్ స్టార్ట్ చేశాడు. రెండో వారం నామినేషన్స్ లో దారుణమైన కామెంట్స్ తో ఆత్మవిశ్వాసం దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. రైతులే కాదు ప్రతి ఒక్కరూ ఈ లోకంలో కష్టపడుతున్నారు. ఏంటి నీ గొప్పా అంటూ ఆ పాయింట్ మీద నామినేట్ చేశాడు.
ఏరా పోరా అంటూ పల్లవి ప్రశాంత్ ని కించపరిచాడు. మొదటి నుండి పల్లవి ప్రశాంత్ పై అమర్ దీప్ కి సదాభిప్రాయం లేదు. అయితే మనం హౌస్లో ఏం చేస్తున్నాం అనేది కూడా ఇక్కడ పాయింట్. ఐదు వారాల్లో అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ పెర్ఫార్మన్స్ పరిగణలోకి తీసుకుంటే… అమర్ జీరో అని చెప్పాలి. అతడు సాధించిన విజయం ఒక్కటి లేదు. ఒక అభద్రతా భావంలో బ్రతుకున్నాడు.
స్ట్రాంగ్ గేమ్ ఆడే ఆలోచనలేదు. కేకలు వేస్తే సరిపోతుందని అనుకుంటున్నాడు. కానీ పల్లవి ప్రశాంత్ నాలుగో పవర్ అస్త్ర గెలిచాడు. అంతకు మించి బిగ్ బాస్ హౌస్ మొదటి కెప్టెన్ అయ్యాడు. ఈ రెండు విజయాలు అతను కష్టపడితేనే దక్కాయి. అమర్ దీప్ ఇలాంటి బెంచ్ మార్క్స్ సెట్ చేయకపోగా… స్ట్రాంగ్ ప్లేయర్ గా కూడా రిజిస్టర్ కాలేదు. తాను సరిగా ఆడలేక పల్లవి ప్రశాంత్ సక్సెస్ ని జీరించుకోలేకపోతున్నాడు.
రంగు పడుద్ది టాస్క్ లో ఎవరు గెలిచినా పర్లేదు, పల్లవి ప్రశాంత్ గెలవకూడదని అమర్ దీప్ గట్టిగా కోరుకున్నాడు. కారణం తాను విమర్శించిన కంటెస్టెంట్ సక్సెస్ అయితే తన వ్యాఖ్యలకు అర్థం లేకుండా పోతుంది. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ మరింత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. సూపర్ పవర్ గెలిచి కొన్ని వారాలు ఢోకా లేకుండా హౌస్లో కొనసాగుతాడు. ఆట పరంగా, ప్రవర్తన పరంగా ఆకట్టుకోని అమర్ దీప్ ఈ వారం ఓటింగ్లో వెనుకబడ్డాడని సమాచారం.