Pakka Commercial First Day Collections: యాక్షన్ హీరో గోపీచంద్ మరియు కామెడీ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కిన పక్క కమర్షియల్ సినిమా నిన్న భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన సినిమా కావడం..అలాగే గోపీచంద్ నుండి చాలా కాలం తర్వాత ఒక్క ఎంటర్టైన్మెంట్ తో కూడిన సినిమా తెరకెక్కడం తో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి..ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం తో గోపీచంద్ పెద్ద హిట్ కొట్టబోతున్నాడని అందరూ అంచనా వేశారు..కానీ ఆ అంచనాలు అన్ని ఇప్పుడు తలక్రిందులు అయ్యాయి..భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కి మొదటి రోజు మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది..దీనితో ఈ సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ పై చాలా తీవ్రమైన ప్రభావం పడింది..గోపీచంద్ గత చిత్రం సీటిమార్ కంటే తక్కువ ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం..ఒక్కసారి ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు ప్రాంతాల వారీగా ఎలా ఉందొ ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Also Read: Pushpa 2 Sensational Decision: పుష్ప 2 హిందీ విషయం లో నిర్మాతలు సంచలన నిర్ణయం
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నైజం ప్రాంతం లో దాదాపుగా 6 కోట్ల రూపాయలకు జరిగింది..టికెట్ రేట్స్ కూడా సామాన్య జనాలకు అందుబాటులోకి ఉండే విధంగానే పెట్టారు..కానీ మొదటి రోజు వసూళ్లు చాలా దారుణంగా ఉన్నాయి అనే చెప్పాలి..ఈ సినిమా నైజం ప్రాంతం మొత్తం కలిపి 80 నుండి 90 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసి ఉంటుందని అంచనా..గోపీచంద్ గత మూవీ సీటిమార్ సినిమా ఇక్కడ మొదటి రోజు కోటి రూపాయిల వరుకు వసూళ్లను రాబట్టింది..ఇక ఆంధ్ర ప్రాంతం లో కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి..ఉత్తరాంధ్ర ప్రాంతం లో పరవాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ ని దక్కించుకున్న ఈ సినిమా..మిగిలిన ప్రాంతాలలో కనీస స్థాయి వసూళ్లను కూడా రాబట్టలేదు..దీనితో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమా కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని రప్పించుకొని బీలో యావరేజి ఓపెనింగ్ అనిపించుకుంది..గోపీచంద్ గత చిత్రం సీటిమార్ సినిమా అతి తక్కువ టికెట్ రేట్స్ మీద కూడా 3 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చెయ్యగా..పక్క కమర్షియల్ చిత్రం దానికంటే 50 లక్షలు తక్కువ చెయ్యడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: Vijay Devarakonda Bold Look: లైగర్ బోల్డ్ లుక్ వైరల్.. అక్కడ గులాబీలను పెట్టుకున్న విజయ్ దేవరకొండ
Recommended Videos
[…] Also Read: Pakka Commercial First Day Collections: పక్కా కమర్షియల్ మొదటి … […]