
దేశంలో వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన వారికి భారత ప్రభుత్వం దేశపు అత్యున్నత పురస్కారాలైన ‘పద్మ అవార్డులను’ అందిస్తుంది. ప్రతీ ఏడాది ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను అందిస్తుంది.
కళలు, సాహిత్యం, విద్య, ఆటలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ వంటి రంగాల్లో విశిష్ట, అసాధారణ సేవలు అందించిన వారికి ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. 2022 పద్మ అవార్డుల కోసం కూడా కేంద్రం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. మీకు తెలిసిన గొప్ప వ్యక్తులను పద్మ అవార్డులకు సిఫార్సు చేయాలని కేంద్రం ప్రకటించింది. చివరి తేదీగా సెప్టెంబర్ 15ను ప్రకటించింది.
పద్మ అవార్డుల నామినేషన్లు, సిఫార్సులు ఆన్ లైన్ లో వెబ్ సైట్ padmaawards.gov.inలో స్వీకరిస్తామని తెలిపింది.
ఈ క్రమంలోనే కరోనా కల్లోలంలో దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకొని రియల్ హీరోగా పేరుగాంచిన సోనూసూద్ పేరును పద్మ అవార్డులకు నామినేట్ చేశాడు ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మాజీ. సోనూ సూద్ కు దేశపు అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్’ పురస్కారాన్ని ఇవ్వాలంటూ తను గట్టిగా కోరుకుంటున్నాంటూ ట్వీట్ చేశాడు. తన ప్రతిపాదనను సమర్థించే వారంతా తన ట్వీట్లను రీట్వీట్ చేయాలని బ్రహ్మాజీ నెటిజన్లను కోరారు.
ఈ ట్వీట్ కు సోనూ సూద్ బదులిచ్చాడు. సోనూ ట్వీట్ చేస్తూ.. ‘135 కోట్ల మంది భారతీయుల ప్రేమ, అభిమానమే పెద్ద అవార్డు. దానిని ఇప్పటికే పొందాను. మీ అభిమానానికి ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
The love of 135 crore Indians is my biggest award brother, which I have already received.🇮🇳
Humbled 🙏 https://t.co/VpAZ8AqxDw— sonu sood (@SonuSood) June 11, 2021