Director P. Chandrasekhar Reddy: నేడు తెలుగు చిత్రసీమలో ఓ విషాద సంఘటన జరిగింది. అలనాటి ప్రముఖ సినీ దిగ్గజ దర్శకుడు పి.చంద్ర శేఖర్ రెడ్డి ఇక లేరు. ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లో ఆయన మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. పి.చంద్ర శేఖర్ రెడ్డికి సినిమాలు అంటే ప్రాణం. సుమారు 75 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించడంతో పాటు 13 సినిమాలకు దర్శకత్వ శాఖలో కూడా పని చేశారు.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి నాటి ప్రముఖ హీరోల చిత్రాలకు పి.చంద్ర శేఖర్ రెడ్డి దర్శకత్వం వహించి.. అందరి హీరోలకు ఓ దశలో మంచి హిట్స్ ఇచ్చారు. అయితే, సూపర్ స్టార్ కృష్ణతో పి.చంద్ర శేఖర్ రెడ్డికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే కృష్ణ చిత్రాలకు పి.చంద్ర శేఖర్ రెడ్డి ఎక్కువగా దర్శకత్వం వహించారు.
Also Read: eddy: సీనియర్ దర్శకుడు పీ చంద్రశేఖర్ రెడ్డి కన్నుమూత… ఎమోషనల్ అయిన సూపర్ స్టార్ కృష్ణ
ఇక పి.చంద్ర శేఖర్ రెడ్డి గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. చివరకు తన అనారోగ్యంతో నేడు తుది శ్వాస విడిచారు. పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. ఆయన 1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు.
సినిమాల పై పిచ్చితో మద్రాసు వచ్చి 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు. వి.మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావు వద్ద సహాయ దర్శకుడిగా, సహ దర్శకుడిగా పని చేసినా.. సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఓ ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు. అనూరాధ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించారు. మా ఓకేతెలుగు.కామ్ తరఫున పి సి రెడ్డి గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం.
Also Read: సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ రాణిస్తున్న స్టార్ హీరోస్ వీళ్లే..