Vijay Sethupathi : ఓటీటీలో దుమ్మురేపుతున్న విజయ్ సేతుపతి లేటెస్ట్ బ్లాక్ బస్టర్… అరుదైన రికార్డు నమోదు చేసిన క్రైమ్ థ్రిల్లర్! ఎక్కడ చూడొచ్చంటే?

హరాజ మూవీ జూన్ 14న విడుదలైంది. మిథిలన్ స్వామినాథన్ మహారాజ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ కీలక రోల్ చేయడం విశేషం. మమతా మోహన్ దాస్, అభిరామి ఇతర రోల్స్ చేశారు. మహారాజ మూవీ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ముగిసింది. ఈ క్రమంలో ఓటీటీలో విడుదల చేశారు.

Written By: NARESH, Updated On : July 17, 2024 11:11 am
Follow us on

Vijay Sethupathi : విజయ్ సేతుపతి విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. చిన్న చిన్న సపోర్టింగ్ రోల్స్ తో మొదలైన ఆయన కెరీర్ హీరో స్థాయికి చేరింది. ప్రస్తుతం హీరో, విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ఆయన లేటెస్ట్ రిలీజ్ మహారాజ బ్లాక్ బస్టర్ కొట్టింది. తమిళంలో మహారాజ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులో సైతం మంచి ఆదరణ దక్కించుకుంది. మహరాజ అవుట్ అండ్ అవుట్ సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఆరంభం నుండి ఊహించని మలుపు, ఉత్కంఠ రేపే సన్నివేశాలతో మహారాజ సాగుతుంది.

మహరాజ మూవీ జూన్ 14న విడుదలైంది. మిథిలన్ స్వామినాథన్ మహారాజ చిత్రానికి దర్శకుడు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఓ కీలక రోల్ చేయడం విశేషం. మమతా మోహన్ దాస్, అభిరామి ఇతర రోల్స్ చేశారు. మహారాజ మూవీ థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ ముగిసింది. ఈ క్రమంలో ఓటీటీలో విడుదల చేశారు. మహారాజ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జులై 12 నుండి మహారాజ స్ట్రీమ్ అవుతుంది.

తమిళ్ తో పాటు తెలుగు, మలయాళ,కన్నడ, హిందీ భాషల్లో మహారాజ అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన మహారాజ… ఓటీటీలో కూడా సత్తా చాటుతుంది. నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ టెన్ లో మహారాజ ఫస్ట్ పొజీషన్ లో ఉంది. మొదటి స్థానంలో మహారాజ ట్రెండ్ అవుతుంది. స్ట్రీమింగ్ మొదలైన నాలుగు రోజుల్లోనే మహారాజ టాప్ లోకి వచ్చింది. ఇది చెప్పుకోదగ్గ విశేషం. మహారాజ మూవీ ఎంతగా ప్రేక్షకులకు నచ్చిందో చెప్పేందుకు నిదర్శనం.

మహారాజ మూవీ కథ ఏమిటో చూద్దాం.. మహారాజ(విజయ్ సేతుపతి) ఒక బార్బర్ షాపులో పని చేస్తాడు. ఒక ప్రమాదంలో భార్య చనిపోతుంది. అదే ప్రమాదం నుండి కూతురు బయటపడుతుంది. అందుకు ఒక చెత్తబుట్ట కారణం అవుతుంది. తన కూతురు ప్రాణాలు కాపాడిన చెత్తబుట్టకు లక్ష్మి అని పేరు పెట్టి ఇంటికి తెచ్చుకుంటాడు మహారాజ. దాన్ని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. ఊరి బయట మహారాజ, కూతురితో పాటు జీవిస్తూ ఉంటాడు.

ఒకరోజు దొంగలు ఆ చెత్త బుట్టను కొట్టేస్తారు. మహారాజ తీవ్ర నిరాశకు గురి అవుతాడు. ఆ చెత్తబుట్టను ఎలాగైనా తిరిగి తెచ్చుకోవాలని పోలీసులను ఆశ్రయిస్తారు. తన చెత్తబుట్ట ఎవరో దొంగిలించారు. వెతికి పెట్టాలని పోలీసులకు చెబుతాడు. ఎలాంటి విలువలేని చెత్తబుట్ట పోయిందని వచ్చిన మహారాజను పిచ్చోడిగా భావిస్తారు. చెత్తబుట్టను వెతకడం కుదరదని పోలీసులు చెబుతారు. అయినా వినకుండా స్టేషన్ లో మొండికేసిన మహారాజను పోలీసులు కొడతారు.

దాంతో మహారాజ పోలీసులకు ఒక ఆఫర్ ఇస్తాడు. ఆ చెత్తబుట్ట వెతికి తెస్తే.. రూ. 7 లక్షల రూపాయలు ఇస్తానని అంటాడు. డబ్బుకు ఆశపడిన పోలీసులు ఓకే అంటారు. వారికి చెత్తబుట్ట దొరకదు. దాంతో ఒక డమ్మీ చెత్తబుట్టను చేయించి, ఒక దొంగ దగ్గర దొరికినట్లు మోసం చేయాలి అనుకుంటారు. అయితే చెత్తబుట్టను వెతికే క్రమంలో ఊహించని విషయాలు వెలుగులోకి వస్తాయి.

ఒక చెత్తబుట్ట కోసం మహారాజ ఎందుకు అంత డబ్బు ఇస్తాను అన్నాడు? ఆ చెత్తబుట్ట వెనకున్న అసలు సంగతి ఏంటి? దాన్ని ఎవరు దొంగిలించారు? ఈ కథలో అనురాగ్ కశ్యప్ పాత్ర ఏంటీ? ఇంతకీ మహారాజకు చెత్తబుట్ట దొరికిందా? అనేది మిగతా కథ. ఆద్యంతం సస్పెన్సు తో సాగుతూ మూవీ ఆడియన్స్ కి కిక్ ఇస్తుంది.