https://oktelugu.com/

This Week OTT Releases: కాజల్, త్రిష నటించిన క్రైమ్ థ్రిల్లర్స్ మీకోసం… ఓటీటీలో ఈ వారం దుమ్మురేపే ఎంటర్టైన్మెంట్!

మరో వీకెండ్ వచ్చేసింది. ఎప్పటిలాగే ఓటిటీ ప్రియులను అలరించేందుకు కొన్ని క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ రెడీగా ఉన్నాయి. ఒకే రోజు ఏకంగా 11 సినిమాలు, సిరీస్లు విడుదల అవుతున్నాయి. వాటిలో నాలుగు సినిమాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అవి తెలుగులో అందుబాటులోకి రావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే ..

Written By:
  • S Reddy
  • , Updated On : August 2, 2024 / 09:49 AM IST

    This Week OTT Releases

    Follow us on

    ఆగస్టు 2న చిన్న హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. రాజ్ తరుణ్ నటించిన తిరగబడరసామీ విడుదల అవుతుంది. యజ్ఞం ఫేమ్ రవికుమార్ చౌదరి ఈ మూవీ దర్శకుడు. మాల్వి మల్హోత్రా హీరోయిన్. విరాజి టైటిల్ తో ఓ భిన్నమైన మూవీ ట్రై చేశాడు హీరో వరుణ్ సందేశ్. ఆయన లుక్ విచిత్రంగా ఉంది. విరాజి సైతం నేడు థియేటర్స్ లో విడుదల అవుతుంది. అలాగే అల్లు శిరీష్ నటించి బడ్డీతో పాటు ఒకటి రెండు చిన్న చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి.

    మరోవైపు ఓటీటీలో అదిరిపోయే యాక్షన్ సిద్ధంగా ఉంది. హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ బృంద . ఈ వెబ్ సిరీస్ ద్వారా త్రిష డిజిటల్ ఎంట్రీ ఇస్తుంది. సూర్య మనోజ్ వంగలం దర్శకత్వం వహించారు. ఇంద్రజిత్ సుకుమారన్, జయ ప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, రాకేందు మౌళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 02 నుంచి ‘ బృంద ‘ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.

    దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి పై తెరకెక్కించిన డాక్యూమెంటరీ మోడ్రన్ మాస్టర్స్ ఎస్ ఎస్ రాజమౌళి . రాఘవ ఖన్నా దర్శకత్వం వహించారు. సమీర్ నాయర్, దీపక్ సెగల్ నిర్మిస్తున్నారు. ఆగస్టు 02వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ డాక్యుమెంటరీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది.

    కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సత్యభామ పాజిటివ్ సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ పెద్దగా ఆడలేదు. సత్యభామ ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఆగస్టు 01 నుండి సత్యభామ ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చింది.

    డియర్ నాన్న చిత్రంలో చైతన్య రావు, సూర్య ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రి కొడుకుల ఎమోషనల్ డ్రామాగా డియర్ నాన్న తెరకెక్కింది. ఆగస్టు 01 నుండి ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, మానస్ లీడ్ రోల్స్ నటించిన సినిమా రక్షణ. ఈ మూవీ ఆగస్టు 01 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా తెరకెక్కిన సినిమా ‘తెప్ప సముద్రం’. ఈ చిత్రం ఆగస్టు 01 న ఆహాలో రిలీజ్ అవుతుంది.

    కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ఇంగ్లీష్ మూవీ. ఆగస్టు 02 నుండి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో .. ఏ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డర్ హాలీవుడ్ వెబ్ సిరీస్ ఆగస్టు 01 నుండి స్ట్రీమ్ అవుతుంది.

    నో వే అవుట్ కొరియన్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. జియో సినిమా లో టారో హాలీవుడ్ మూవీ ఆగస్టు 03 నుండి స్ట్రీమ్ కానుంది. అలాగే ఘుడ్ చడీ, డ్యూన్ 2 ఆగస్టు 01నుండి జియో సినిమాలో స్ట్రీమ్ కానున్నాయి.