This Week OTT Release: రాజమౌళి బయోపిక్, త్రిష క్రైమ్ థ్రిల్లర్ తో పాటు ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు! నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్!

వచ్చే శుక్రవారం ఓటీటీలో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి రంగం సిద్ధం అవుతుంది. క్రేజీ చిత్రాలు, సిరీస్లు ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో రాజమౌళి బయోపిక్ తో పాటు హీరోయిన్ త్రిష నటించిన బృంద క్రైమ్ సిరీస్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఏమిటో చూద్దాం

Written By: S Reddy, Updated On : July 29, 2024 5:58 pm

This Week OTT Release

Follow us on

This Week OTT Release: ప్రతివారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలై సందడి చేస్తుంటాయి. కాగా ఈ వారం స్టార్ హీరోల సినిమాల సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. అశ్విన్ బాబు’ శివమ్ భజే ‘, రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న’ తిరగబడర సామి థియేటర్స్ లోకి వస్తున్నాయి. అలాగే ‘ ఉషా పరిణయం ‘, ‘ బడ్డీ ‘ వంటి స్మాల్ బడ్జెట్ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. వీటిలో ఏ ఒక్క మూవీపై పెద్దగా బజ్ లేదు. ఇక ఓటీటీల విషయానికి వస్తే ఈ వారం ఏకంగా 20 సినిమాలు/ వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యాయి.

నెక్స్ట్ ఫ్రైడే ఓటీటీలోకి వస్తున్న క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ ఏమిటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో?.. ఆ వివరాలు తెలుసుకుందాం..

నెట్ ఫ్లిక్స్

ఏ గుడ్ గర్ల్ గైడ్ టు మర్డర్ – ఇంగ్లీష్ సిరీస్ – ఆగస్టు 01
బోర్డర్ లెస్ ఫాగ్ – ఇండోనేషియన్ మూవీ – ఆగస్టు 01
లవ్ ఈజ్ బ్లైండ్ మెక్సికో – స్పానిష్ సిరీస్ – ఆగస్టు 01
మ్యాన్ లాఫెర్ట్ టేమో – స్పానిష్ సిరీస్ – ఆగస్టు 01
అన్ స్టేబుల్ సీజన్ 02 – ఇంగ్లీష్ సిరీస్ – ఆగస్టు 01
మోడ్రన్ మాస్టర్స్ ఎస్ ఎస్ రాజమౌళి – తెలుగు డాక్యుమెంటరీ – ఆగస్టు 02
సేవింగ్ బికినీ బాటమ్ – ఇంగ్లీష్ సినిమా – ఆగస్టు 02
జో రోగన్ – ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్ – ఆగస్టు 03.

అమెజాన్ ప్రైమ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ; ది రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ 2- ఇంగ్లీష్ సిరీస్ – జూలై 29
బ్యాట్ మ్యాన్ క్యాప్డ్ క్రూసేడర్ – ఇంగ్లీష్ సిరీస్ – ఆగస్టు 01

హాట్ స్టార్
ఫ్యూచరమా సీజన్ 12 – ఇంగ్లీష్ సిరీస్ – జూలై 29
నో వే ఔట్ – కొరియన్ సిరీస్ – జులై 31
కింగ్ డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా – ఆగస్టు 02

బుక్ మై షో .. ద బైక్ రైడర్స్ ఇంగ్లీష్ సినిమా – ఆగస్టు 02.

జియో సినిమా

డ్యూన్ పార్ట్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా – ఆగస్టు 01
గుహడ్ చడీ – హిందీ మూవీ – ఆగస్టు 02
టరోట్ – ఇంగ్లీష్ మూవీ – ఆగస్టు 03
దస్ జూన్ కి రాత్ – హిందీ సిరీస్ – ఆగస్టు 04

సోనీ లివ్

బృందా – తెలుగు డబ్బింగ్ సిరీస్ – ఆగస్టు 02

ఆపిల్ ప్లస్ టీవీ

ఉమెన్ ఇన్ బ్లూ- ఇంగ్లీష్ సిరీస్ – జూలై 31

ఈ సినిమాలు, వెబ్ సిరీస్లలో నాలుగింటి పై జనాల్లో క్రేజ్ ఉంది. వాటి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు రాజమౌళి జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ ‘ మోడరన్ మాస్టర్స్ ‘. హీరోయిన్ త్రిష మెయిన్ లీడ్ గా నటించిన మొదటి వెబ్ సిరీస్ బృందా, కింగ్ డమ్ ఆఫ్ ది ఏప్స్ ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్. డ్యూన్ పార్ట్ 2 లాంటి తెలుగు డబ్బింగ్ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.