Operation Valentine OTT: హఠాత్తుగా ఓటీటీ లోకి.. ఆపరేషన్ వాలెంటైన్.. ఎక్కడ స్ట్రీమ్ అవుతోందంటే..

ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దశకత్వం వహించాడు. ఈ సినిమాను మార్చి 1న విడుదల చేశారు. విడుదలకు ముందు నిర్వహించిన వేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

Written By: Raj Shekar, Updated On : March 23, 2024 8:50 am

Operation Valentine OTT

Follow us on

Operation Valentine OTT: ఒకప్పుడు సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత.. చాలా కాలానికి టీవీలలో టెలికాస్ట్ అయ్యేవి. అప్పట్లో ఇంతటి పరిజ్ఞానం లేదు కాబట్టి.. టీవీలు ప్రోమో విడుదల చేస్తేనే తెలిసేది. ఇప్పుడలా కాదు కదా… సినిమా విడుదలైన కొద్ది రోజులకే ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఓటీటీ లో స్ట్రీమ్ అవుతున్నాయి. అలా ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న తెలుగు సినిమా operation valentine. తెలుగులో వైమానిక దళ నేపథ్యంలో వచ్చిన తొలి సినిమా ఇదే. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. అతడికి జోడిగా మనిషి చిల్లర్ నటించింది.. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు దక్కించుకోలేదు. పుల్వామా, బాలాకోట్ ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.

ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ దశకత్వం వహించాడు. ఈ సినిమాను మార్చి 1న విడుదల చేశారు. విడుదలకు ముందు నిర్వహించిన వేడుకలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో మొట్టమొదటిసారిగా వైమానిక దళ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇదే అని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ మొత్తం చిరంజీవి కనసన్నలో నడిచిందనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఇక ఉత్తరాది మార్కెట్ లోనూ ఈ సినిమాకు విపరీతంగా ప్రచారం చేశారు. అయితే అప్పటికే హృతిక్ రోషన్ ఫైటర్ సినిమా విడుదల కావడంతో.. చాలామంది ఆపరేషన్ వాలెంటైన్ సినిమాను దానితో పోల్చారు. దీంతో అక్కడ కూడా ఆశించినంత స్థాయిలో కలెక్షన్లు రాలేదు.

అయితే ఈ సినిమా ప్రస్తుతం OTT లోకి వచ్చేసింది. విడుదలైన 20 రోజుల్లో ఈ సినిమాను Amazon prime స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను అందుబాటులో ఉంచింది. ఓటిటి స్ట్రీమింగ్ నేపథ్యంలో ఈ చిత్ర యూనిట్ ఎటువంటి ప్రచారం చేయలేదు కాబట్టి.. సైలెంట్ గా Amazon prime స్ట్రీమింగ్ చేయడం ప్రారంభించింది. థియేటర్లలో ఈ సినిమాను చూడనివారు అమెజాన్ ప్రైమ్ లో వీక్షించొచ్చు.