OTT: ఇండియన్ గవర్నమెంట్ ఇటీవల తీసుకొచ్చిన బ్రాడ్ క్యాస్టింగ్ బిల్ విషయంలో వెనక్కి తగ్గింది. పరిశ్రమ ప్రతినిధులు, ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్స్ నుండి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పునరాలోచనలో పడింది. రూపొందించిన బ్రాడ్ క్యాస్టింగ్ బిల్ రహస్యంగా కొన్ని వర్గాలతో మాత్రమే చర్చించి నిర్ణయం తీసుకోవడం విమర్శల పాలైంది. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ కొత్త బిల్లును పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నట్లు వెల్లడించింది. ప్రేక్షకులు, ప్రజలు తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో వెల్లడించాలని తెలియజేయడమైంది. ఈ నిర్ణయం ఓటీటీ సంస్థలలో ఆనందం నింపింది.
అక్టోబర్ 15 వరకు అభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. అనంతరం బ్రాడ్ కాస్టింగ్ నూతన బిల్ రూపొందించనున్నారు. డిజిటల్, ఆన్లైన్ కంటెంట్ ని సాంప్రదాయ బ్రాడ్ క్యాస్టర్స్ వలె పరిగణించడం చిన్న సంస్థలకు సమస్యగా మారింది. బ్రాడ్ క్యాస్టింగ్ బిల్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఇండస్ట్రీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది. ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ ని సాంప్రదాయ బ్రాడ్ క్యాస్టర్స్ గా పరిణగణించకూడదు. అది చిన్న, మధ్యతరగతి సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
అలాగే ప్రభుత్వం అమలులోకి తేవాలనుకుంటున్న బిల్ లో పారదర్శకత ఉండాలి. పబ్లిక్ దృష్టికి తేవాలని బ్రాడ్ క్యాస్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం తెచ్చిన బిల్లు అమలు చేస్తే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ వంటి ఓటీటీ సంస్థలు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు విధిగా రిజిస్టర్ చేసుకోవాలని బిల్ లో పొందుపరిచారు. దీని కోసం అనేక లీగల్ పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. పేపర్ వర్క్ పేరుతో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
అలాగే ఓటీటీ సంస్థలు కంటెంట్ ప్రసారం, అడ్వర్టైజింగ్ విషయంలో ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చెప్పాలంటే టెలివిజన్ ఛానల్స్ మాదిరి కఠిన నిబంధనలు అనుసరించాలి. ఈ విషయంలో వారు కొన్ని ప్రత్యేకమైన విలువలు పాంటించాల్సి ఉంటుంది. ఇది చిన్న సంస్థలకు శరాఘాతం అవుతుంది.
నూతన బ్రాడ్ క్యాస్టింగ్ బిల్ ఓటీటీ, డిజిటల్ కంటెంట్ బ్రాడ్ క్యాస్టర్స్ కి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రభుత్వం కఠిన నిబంధనలతో బిల్ రూపొందించడం వెనుక పబ్లిక్ డిమాండ్ కూడా ఉంది. డిజిటల్ కంటెంట్ పై ఎలాంటి పరిమితులు లేకపోవడం యువతతో పాటు చిన్నపిల్లలపై చెడు ప్రభావం చూపుతుంది. డిజిటల్ కంటెంట్ లో వైలెన్స్, శృంగారం, ఫోల్ లాంగ్వేజ్ అధికంగా ఉంటుంది. డిజిటల్ కంటెంట్ కి అలవాటు పడిన పిల్లలు విపరీత చర్యలకు పాల్పడే అవకాశం ఉంది.
కొన్ని వెబ్ సిరీస్లు, చిత్రాలు కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూడలేని పరిస్థితి ఉంది. ఆ మధ్య వెంకటేష్-రానా దగ్గుబాటి నటించిన రానా నాయుడు పై తీవ్ర చర్చ నడిచింది. రానా నాయుడు ఓ హాలీవుడ్ సిరీస్ కి రీమేక్. దాదాపు అదే స్థాయిలో దాన్ని తెరకెక్కించారు. వెంకటేష్ వంటి ఫ్యామిలీ స్టార్ బూతులు మాట్లాడటం ఏంటని ఆడియన్స్ వాపోయారు. ఆ సిరీస్లో శృతి మించిన శృంగార సన్నివేశాలు చూసి ఆడియన్స్ హర్ట్ అయ్యారు. మారుతున్న కాలాన్ని బట్టి మారక తప్పదని వెంకటేష్ సమర్ధించుకోవడం విశేషం. కొంత మేర డిజిటల్ కంటెంట్ప్ పై పరిమితులు విధించడం అనివార్యం..