https://oktelugu.com/

Family Star OTT: ఓటీటీలో ఫ్యామిలీ స్టార్ … ఆ రెండు సీన్స్ పై ట్రోల్స్ షురూ, భలే బుక్ అయ్యారే!

కథతో పాటు కథనం కూడా నిరాశపరచడంతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని జనాలు ఆదరించలేదు. ఓపెనింగ్స్ సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ స్టార్ ఫెయిల్ అయిన నేపథ్యంలో నిర్ణీత సమయం కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 28, 2024 / 06:46 PM IST

    Family Star OTT

    Follow us on

    Family Star OTT: గీత గోవిందం కాంబో అనగానే ప్రేక్షకుల్లో ఎక్కడ లేని అంచనాలు ఏర్పడ్డాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం యూత్ ఆతృతగా ఎదురు చూశారు. అయితే అంచనాలు అందుకోవడంలో దర్శకుడు పరశురామ్, హీరో విజయ్ దేవరకొండ ఫెయిల్ అయ్యారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న విడుదలైన ఫ్యామిలీ స్టార్ చిత్రం ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండకు జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది. మిడిల్ క్లాస్ యువకుడిగా విజయ్ దేవరకొండ పాత్ర తీర్చిదిద్దారు.

    కథతో పాటు కథనం కూడా నిరాశపరచడంతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని జనాలు ఆదరించలేదు. ఓపెనింగ్స్ సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ స్టార్ ఫెయిల్ అయిన నేపథ్యంలో నిర్ణీత సమయం కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసింది. నాలుగు వారాలు ముగియకుండానే ఫ్యామిలీ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ స్టార్ డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 26 నుండి ఫ్యామిలీ స్టార్ అందుబాటులోకి వచ్చింది.

    ఓటీటీ లో ఫ్యామిలీ స్టార్ చూసిన ప్రేక్షకులు ట్రోల్స్ షురూ చేశారు. కొన్ని సీన్స్ ని ట్రోల్ చేస్తూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ మూవీలోని పలుచటి దోస సీన్, రవిబాబుకి విజయ్ దేవరకొండ వార్నింగ్ ఇచ్చే సీన్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దోస దగ్గర పిసినారితనం చూపించే హీరో ఏడాదికి లక్షల రూపాయల మందు తాగుతాడు. సినిమా మొత్తం అయ్యాక కథ ఏమిటో ఎవరికీ తెలియదు. చివరికి పరశురామ్ కి కూడా …అని ఒక నెటిజెన్ ఓ పోస్ట్ పెట్టాడు.

    మరొక నెటిజెన్… రవిబాబుకి హీరో వార్నింగ్ ఇచ్చే సీన్ లో డైలాగ్స్ వరస్ట్ ని కామెంట్ పెట్టాడు. విడుదల సమయంలో కూడా ఫ్యామిలీ స్టార్ విపరీతమైన నెగిటివిటీ ఎదుర్కొంది. ఓటీటీలో కూడా తప్పడం లేదు. ఫ్యామిలీ స్టార్ సోషల్ మీడియా రివ్యూల మీద నిర్మాత దిల్ రాజు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఫ్యామిలీ స్టార్ మూవీ విజయ్ దేవరకొండకు ఝలక్ ఇచ్చింది.