https://oktelugu.com/

Mr And Mrs Mahi OTT: దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ నటించిన రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలో… ఎక్కడ చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ లవ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి దేవర హీరోయిన్ నటించిన ఈ చిత్రం ఏమిటీ? అది ఎక్కడ చూడొచ్చో తెలుసుకుందాం..

Written By:
  • S Reddy
  • , Updated On : July 29, 2024 / 12:01 PM IST

    Mr And Mrs Mahi OTT

    Follow us on

    Mr And Mrs Mahi OTT: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావ్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ మిస్టర్ అండ్ మిసెస్ మాహి ‘. రొమాంటిక్ లవ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమా మే 31న థియేటర్లలో విడుదలైంది. మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి మంచి స్పందన లభించింది. రెగ్యులర్ స్పోర్ట్స్ కథ .. పైగా కొత్తదనం లేకపోవడం కాస్త మైనస్ అయింది. అయినప్పటికీ కలెక్షన్స్ పరంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ థియేట్రికల్ రన్ ముగిసింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది. ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది? ఆ వివరాలేంటో పరిశీలిస్తే..

    Also Read: ఏ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.. వీడియో లీక్ పై ఊర్వశి రౌతేలా ఓపెన్ కామెంట్స్! వివాదం ఏమిటంటే?

    మిస్టర్ అండ్ మిసెస్ మహి డిజిటల్ రైట్స్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. జులై 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ పై ఎలాంటి సమాచారం లేదు. ఇది తెలుగు ఆడియన్స్ ని ఒకింత నిరాశపరిచే అంశమే. మిస్టర్ అండ్ మిసెస్ మహి కథ విషయానికి వస్తే .. మహేంద్ర(రాజ్ కుమార్ రావ్) ఓ ఫెయిల్యూర్ క్రికెటర్. ఏళ్ల తరబడి బ్రేక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ క్రికెట్ వదిలేసి సెటిల్ కావాలని తండ్రి బలవంతం చేస్తూ ఉంటాడు. మరో ఏడాది సమయం ఇస్తే తానేంటో నిరూపించుకుంటాను అని తండ్రిని బతిమాలుకుంటాడు.

    కానీ దానికి మహేంద్ర తండ్రి అంగీకరించడు. ఇవన్నీ మానేసి స్పోర్ట్డ్ షాప్ చూసుకోవాలని చెప్తాడు. ఆ వెంటనే మహిమ అగర్వాల్(జాన్వీ కపూర్) తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. దీంతో తన ఫెయిల్యూర్ కథను మహిమ తో చెప్పుకుంటాడు మహేంద్ర. మహిమకు కూడా క్రికెట్ అంటే అమితమైన ఇష్టం ఉండటంతో అతన్ని అర్థం చేసుకుని పెళ్లికి ఓకే అంటుంది. ఆమె ఒక డాక్టర్ కాగా క్రికెట్ అంటే చాలా ఇష్టం. మరి మహేంద్ర, మహిమ ప్రయాణం ఎలా సాగింది? మహేంద్ర గొప్ప క్రికెటర్ అయ్యాడా? అనేది మిగతా కథ…

    అభిషేక్ బెనర్జీ, రాజేష్ శర్మ, కుముద్ మిశ్ర, జరీనా వాహబ్, పూర్నెందు భట్టాచార్య కీలక పాత్రల్లో నటించారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యష్ జోహర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా ఈ చిత్రానికి నిర్మాతలు. శరన్ శర్మ దర్శకత్వం వహించారు.

    Also Read: బిగ్ బాస్ 8 టైటిల్ విన్నర్ అప్పుడే డిసైడ్ అయిపోయిందా..? అదే నిజమైతే చరిత్ర అవుతుంది!

    ఇక జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ కి జంటగా ‘ దేవర ‘ మూవీలో నటిస్తుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర విడుదల కాకుండానే రామ్ చరణ్ కి జంటగా ఛాన్స్ కొట్టేసింది. బుచ్చిబాబు – రామ్ చరణ్ కాంబోలో వస్తున్న ఆర్సీ 16 లో హీరోయిన్ గా నటిస్తుంది. జాన్వీ కపూర్ నటించిన ఉలజ్ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది. ఉలజ్ చిత్ర ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ పాల్గొంటుంది. ఉలజ్ ఆగస్టు 2న విడుదల కానుంది.