OTT: కరోనా కాలంలో సినిమాలకు ఊపిరి పోసింది ఓటీటీ సంస్థలే. పైగా నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో అప్ డేట్ అవుతూ వస్తున్నాయి ఓటీటీ సంస్థలు. ఇక కరోనా మూడో వేవ్ రావడంతో ప్రస్తుతం మళ్ళీ సినిమా రంగానికి కనిపిస్తున్న ఏకైక ఆశా కిరణం ఓటీటీ. ఎలాగూ ఈ కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించేది కూడా ఒక్క ఓటీటీ మాత్రమే. నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టేది కూడా ఓటీటీ సంస్థలు మాత్రమే. గత రెండేళ్ల నుంచి కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం కూడా ఒక్క ఓటీటీ మాత్రమే.

పైగా ఓటీటీ సంస్థలు ప్రతివారం ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ తో వస్తోంది. మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
Also Read: చరణ్ – ఎన్టీఆర్ ల మధ్య తేడా చెప్పిన రాజమౌళి !

ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.
మహాన్- ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (అమెజాన్ ప్రైమ్)
భామాకలాపం- ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (ఆహా)
గెహ్రాహియా- ఫిబ్రవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (అమెజాన్ ప్రైమ్)
మళ్లీ మొదలైంది- ఫిబ్రవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (జీ5)
ఖిలాడీ- ఫిబ్రవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (థియేటర్)
ఎఫ్‌ఐఆర్- ఫిబ్రవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (థియేటర్)
సెహరి- ఫిబ్రవరి 11వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (థియేటర్)
డీజే టిల్లు- ఫిబ్రవరి 12వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. (థియేటర్)

[…] Cinema Viral : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఉందని జబర్దస్త్ జడ్జి రోజా చెప్పారు. హోమ్ టూర్ పేరుతో ఇటీవల రోజా ఇంట్లో హైపర్ ఆది టీమ్ స్కిట్ చేసింది. అక్కడ హాల్‌లో బాలాజి విగ్రహం ఉంది. ఆయన్ని ఏం కోరుకుంటారమ్మా అని ఆది అడిగితే.. ‘కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉంది’ అని రోజా తెలిపారు. ‘కృష్ణా రామా అని ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో మనకెందుకమ్మా ఈ మహేష్ బాబు సినిమాలు’ అంటూ ఆది సెటైర్ వేశాడు. […]