https://oktelugu.com/

OTT Telugu Bigboss: తెలుగు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరే..: ఎవరంటే..?

OTT Telugu Bigboss: ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మరో సీజన్ కోసం కొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ ఈ షో ప్రియుల కోసం కింగ్ నాగార్జునల కొత్త రూట్ ఎంచుకున్నారు. ఓటీటీ ద్వారా బిగ్ బాస్ షో ప్రసారం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా మారారు. అయితే ఇందులో నటించడానికి కంటెస్టెంట్లను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 29, 2021 / 09:26 AM IST
    Follow us on

    OTT Telugu Bigboss: ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మరో సీజన్ కోసం కొన్ని రోజులు ఆగాల్సిందే. కానీ ఈ షో ప్రియుల కోసం కింగ్ నాగార్జునల కొత్త రూట్ ఎంచుకున్నారు. ఓటీటీ ద్వారా బిగ్ బాస్ షో ప్రసారం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అందుకు సంబంధించిన పనుల్లో బిజీగా మారారు. అయితే ఇందులో నటించడానికి కంటెస్టెంట్లను కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ 5 సీజన్లలో రానివారు.. కొత్త వారిని ఇందులోకి దించుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇకరిద్దరు పేరు కూడా కన్ఫామ్ అయినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వివరాలు కూడా బయటికి వచ్చాయి.

    OTT Telugu Bigboss

    సాధారణంగా బిగ్ బాస్ సీజన్ కోసం మీడియాలో ప్రముఖంగా ఉన్నవారిని తీసుకుంటారు. సోషల్ మీడయాలో పాపులర్ అయినవారికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈసారి జాబితా కొత్త రకంగా తయారు చేస్తున్నారు. ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం షో మేకర్స్ ఇప్పటికే బిజీగా మారారు. వీరిలో ఇప్పటి వరకు హౌస్ కు రానివారే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మరికొందరిని సంప్రదించినా వారు ఒప్పుకునే అవకాశాలు లేనట్లే తెలుస్తోంది.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ‘పే పర్ వ్యూ’లో.. వర్కౌట్ అవుతుందా ?

    టిక్ టాక్ యాప్ ద్వారా పాపులర్ అయిన యాంకర్ శిశ ఓటీటీ బిగ్ బాస్ కు కన్ఫామ్ అయినట్లు సమాచారం. షో మేకర్స్ ఆయనను సంప్రదించగా వెంటనే ఒప్పేసుకున్నారు. అలాగే డీ 10 విన్నర్ రాజు, ప్రముఖ యాంకర్ వర్షిణి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వీరు ఓటీటీ బిగ్ బాస్ కు ఓకే చెప్పినట్లే తెలుస్తోంది. మరోవైపు షణ్ముక్ తేజ్ తో కలిసి వెబ్ సిరీసులో నటించిన వైష్ణవి చైతన్యనను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది.

    కానీ ఆమె ఇప్పటికే సినిమాల్లో బిజీగా మారడంతో దీనికి ఒప్పుకునే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్న వైష్ణవి చేతిలో రెండు, మూడు అవకాశాలున్నాయి. దీంతో ఆమె ఒప్పుకోకపోవచ్చని అంటున్నారు. అయితే షో నిర్వాహకులు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే చెప్పలేమని అంటున్నారు.

    టెలివిజన్లో ప్రసారమయ్యే బిగ్ బాస్-6 వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. అయితే అంతకుముందే ఓటీటీ బిగ్ బాస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఓటీటీ బిగ్ బాస్ హోస్టు గా కూడా నాగార్జునే ఉండనున్నారు. ఓటీటీ బిగ్ బాస్ 24 గంటలు ప్రసారం కానుంది. దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం చేయనున్నారు. అయితే టెలివిజన్లో ఎడిట్ చేసి చూపించేవారు. కానీ ఇందులో ఎలా చూపిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Also Read:  ప్చ్.. సుక్కు – బన్నీ మధ్య ఇంత ప్రేమ ఉందా ?