Mention 24 Movie Review : నిజానికి ఒక హారర్ సినిమా చూడాలి అంటే ఆ సినిమాకు సంబంధించిన క్వాలిటీ అనేది చాలా బాగుండాలి. అలాంటి సందర్భంలోనే ఒక హార్రర్ సినిమా అనేది చూసే ఆడియన్ కి విజువల్ గా గాని,సౌండ్స్ పరంగా కానీ అతన్ని ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేయగలుగుతాయి. ప్రస్తుతం ఓటిటి లో చాలా హార్రర్ సినిమాలు వచ్చి సందడి చేస్తున్న సమయంలో ఓంకార్ డైరెక్షన్ లో వచ్చిన మెన్షన్ 24 అనే సినిమా డిస్నీ+హిట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఇక ఇప్పటికీ కొన్ని హార్రర్ సినిమాలు తీసిన అనుభవం ఉన్న ఓంకార్ ఈ సినిమా తీశాడు అయితే ఈ సినిమా ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ముందుగా ఈ స్టోరీ విషయానికి వస్తే కాళిదాసు( సత్యరాజ్) అనే ఒక పురావస్తు శాఖకు సంబంధించిన శాస్త్రజ్ఞుడు ఒక పాటు బడ్డ మెన్షన్ కి వెళ్తాడు.ఇక అక్కడి నుంచి ఆయన ఎవరికి కనిపించకుండా మిస్ అయిపోతాడు. ఆయన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి తన కూతురు అయిన అమృత ( వరలక్ష్మి శరత్ కుమార్) ఆయన కోసం ఆ మెన్షన్ కి వెళ్తుంది అక్కడ వాళ్ళ నాన్నని ఆమె చూసిందా, అక్కడ ఆమెకి ఎదురైనా సంఘటనలు ఏంటి, కాళిదాసు దేశ ద్రోహి అని ఎవరు క్రియేట్ చేశారు. అలాగే 24 అనే రూమ్ నెంబర్ లోకి వరలక్ష్మి వెళ్లిందా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
ఇక ఈ సినిమా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఒకసారి బ్రీఫ్ గా అనాలసిస్ చేద్దాం
సత్యరాజ్ పోషించిన కాళిదాసు అనే పాత్రకి మంచి ఇంపార్టెన్స్ ఉంది అయితే ఆ పాత్ర కి సత్య రాజ్ గారిని తీసుకొని చాలా మంచి పని చేశారు.ఇక ఆయన పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. ప్రతి సీన్ కూడా చాలా బాగా రాసుకున్నారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఒక సీన్ లో ఉన్న ఇంటెన్స్ ని 100% స్క్రీన్ పైన డెలివరీ చేయడంలో డైరెక్టర్ కొద్దిపాటిగా తడపడ్డాడు అనే చెప్పాలి. ముందుగా ఓంకార్ విషయానికి వస్తే ఓంకార్ ఇంతకుముందు చేసిన అన్ని సినిమాల్లో కూడా ఆయన క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడంలో కరెక్ట్ గా చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ ని సినిమా మొత్తం నిలబెట్టడం లో ఓంకార్ మొదటి నుంచి చేసే తప్పు ఏంటంటే ఆ క్యారెక్టర్ డిమాండ్ అనేది క్రమేణా తగ్గిపోతూ ఉంటుంది.అలా చేయడం వల్ల ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ డిస్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.అందుకే ఒక క్యారెక్టర్ డిజైన్ చేసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ లో మన ఆడియన్ ఇన్వాల్వ్ అయి ఆ క్యారెక్టర్ తో గానీ,ఆ సినిమాతో గానీ సినిమా మొత్తం రన్ అవ్వాలి అంటే ఆ క్యారెక్టర్ పరిధి ప్రకారమే ఆ క్యారెక్టర్ అనేది పర్ఫాం చేస్తూ ఉండాలి. అలా కాకుండా వాటితో ఆ క్యారెక్టర్ కి ఇంటర్ లింక్ లేనిది చేయకూడదు…అయితే కొన్ని సీన్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ అలానే చేస్తుంది అందుకే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ తో మధ్యలో ఆడియెన్స్ డిస్ కనెక్ట్ అవుతు ఉంటారు ఎందుకు అంటే వరలక్ష్మి గారిని ఫస్ట్ నుంచి ధైర్యంగా చూపించారు కానీ మధ్యలోకి వచ్చేసరికి కొన్ని సిల్లీ విషయాలకి కూడా ఆమె భయపడేలా క్యారెక్టర్ షేడ్స్ అనేవి మార్చేశారు. అలా చేయడం వల్ల ఆ క్యారెక్టర్ జనాలకి నచ్చకుండ పోయింది….
ఇక ఈ సినిమాలో చేసిన హీరో నందు, కాలకేయ ప్రభాకర్, రాజీవ్ కనకాల లాంటి వారు వాళ్ల పాత్ర ల పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించారు…ఇక డైరెక్టర్ ఓంకార్ కొన్ని విషయాల్లో డైరెక్షన్ మీద అసలు శ్రద్ద తీసుకోకుండా లైట్ గా తీశారు…అలాగే ఈ సినిమా సినిమాటోగ్రఫీ చాలా అద్బుతం గా ఉంది…అలాగే ఎడిటర్ మెన్షన్ కి సంభందించిన కొన్ని సీన్లలో ఇంకా కొంచం షార్ప్ ఎడిట్ ని వాడితే బాగుండేది…
ఇక ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అంటే వరలక్ష్మి యాక్టింగ్, విజువల్స్ అనే చెప్పాలి
ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే క్యారెక్టర్ లకి ఇచ్చిన ఎస్టాబ్లిష్ మెంట్ తో వాటిని ఎక్కువ సేపు రక్తి కట్టించడం లో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు.అలాగే రాజీవ్ కనకాల క్యారెక్టర్ ను ఇంకా బాగా వాడుకునే ఉంటే బాగుండేది….
ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5…