Ormax Survey: ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ దేశవ్యాప్తంగా సినీ తారలు, సినిమాలు వాటి ఫలితాల పై ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. తాజాగా 2023 డిసెంబర్ నెలకు సంబంధించి తెలుగు నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ జాబితాను విడుదల చేసింది. కాగా అందులో బుల్లితెర పై అలరిస్తున్న కొందరు సెలెబ్రెటీలు టాప్ 5 లో నిలిచారు. అయితే అనూహ్యంగా ఓ కమెడియన్ .. హీరో నాగార్జున ని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచాడు.
అతను మరెవరో కాదు జబర్దస్త్ కమెడియన్ హైపర్ అది. అందరు మెచ్చిన బుల్లితెర నటుల్లో టాప్ 1 పొజిషన్ దక్కించుకున్నాడు. ఆది మొదటి స్థానంలో ఉండటం ఇది మొదటిసారి కాదు. కానీ బిగ్ బాస్ హోస్ట్ గా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్న హీరో నాగార్జున రెండో స్థానంలో నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలా నాగార్జున కి రెండో స్థానం దక్కింది. ఇక మూడో స్థానంలో యాంకర్ ప్రదీప్ ఉన్నాడు.
యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ప్రదీప్ అనేక షోలలో అవకాశాలు దక్కించుకుని రాణించాడు. అలాగే పలు సినిమాల్లో కూడా నటించాడు. షోలు, ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరేట్ గా మారిపోయాడు. ఇక నాలుగో స్థానం సుధీర్ సొంతం చేసుకున్నాడు. సుధీర్ జబర్దస్త్ లో కమెడియన్ గా వచ్చి .. టీం లీడర్ అయ్యాడు. ఆ తర్వాత పోవే పోరా, శ్రీ దేవి డ్రామా కంపెనీ, సూపర్ సింగర్ జూనియర్స్ వంటి షో లకు యాంకరింగ్ చేసి మెప్పించాడు.
ప్రస్తుతం సినిమాలు, ఒక పక్క షో లు చేస్తూ కెరీర్ లో సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నాడు. ఇక టాప్ 5 లో పల్లవి ప్రశాంత్ నిలవడం విశేషం. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎవరు ఊహించని విధంగా ఆటను ప్రదర్శించి విన్నర్ గా నిలిచాడు ప్రశాంత్. టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన పల్లవి ప్రశాంత్ .. బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించాడు. అందరు మెచ్చిన బుల్లి తెర నటుల జాబితాలో టాప్ 5 స్థానం దక్కించుకున్నాడు. నాగార్జున వంటి స్టార్ హీరో పక్కన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ నిలవడం ఊహించని పరిణామం.