టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ గత కొన్ని నెలలుగా కుడి భుజం నొప్పితో బాధ పడుతుండగా చికిత్స కోసం ఈ నెల 31వ తేదీన కేర్ ఆస్పత్రికి వెళ్లారు. కేర్ ఆస్పత్రి వైద్యులు బాలకృష్ణ విపరీతమైన నొప్పితో బాధ పడుతున్నాడని గుర్తించి ఈరోజు 4 గంటల పాటు బాలయ్య భుజం కండరాల స్నాయువులను సరి చేయడానికి చికిత్స చేశారు. కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ రఘువీరరెడ్డి, బీఎన్ ప్రసాద్ చికిత్స నిర్వహించారు.
చికిత్స అనంతరం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే కనీసం ఆరు వారాలపాటు బాలకృష్ణ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. బాలయ్య భుజానికి సర్జరీ జరిగిందని వార్త వైరల్ కావడంతో ఆయన ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అఖండ సినిమా కోసం బాలయ్య ఎన్నో రిస్కీ ఫైట్లు చేశారు.
ఆ ఫైట్ సీన్ల వల్లే బాలకృష్ణకు ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. అఖండ షూటింగ్ ను బాలకృష్ణ పూర్తి చేయగా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను ఆధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో టాక్ షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
బాలయ్య తరువాత సినిమా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. అనంతపురం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుందని క్రాక్ సినిమాను మించి ఈ సినిమా ఉండేలా గోపీచంద్ మలినేని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.