Ratan Tata: రతన్ టాటా సుదీర్థ వ్యాపార ప్రస్థానం లో పలు విప్లవాత్మక సంస్కరణలు, ఉత్పత్తులు తీసుకువచ్చారు. ఆయన సినిమా నిర్మాణంలో కూడా అడుగు పెట్టడం విశేషం. రతన్ టాటా ఒకే ఒక సినిమా నిర్మించారు. ఆ సినిమా ఏమిటీ? దాని బాక్సాఫీస్ ఫలితం ఏమిటో చూద్దాం..
ఫిల్మ్ ఇండస్ట్రీ టర్నోవర్ రెండు దశాబ్దాల క్రితమే వందల కోట్లకు చేరుకుంది. ఈ క్రమంలో కార్పొరేట్ సంస్థలు ఆ వైపుగా అడుగులు వేశాయి. ప్రస్తుతం పలు వ్యాపార సంస్థలు చిత్రాలు నిర్మిస్తున్నాయి. రతన్ టాటా సైతం చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. టాటా ఇన్ఫోమీడియా బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ఏత్ బార్. అమితాబ్ బచ్చన్, జాన్ అబ్రహం, బిపాసా బసు ప్రధాన పాత్రలు చేశారు.
ఏత్ బార్ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. 2004 జనవరి 23న ఏత్ బార్ విడుదల చేశారు. దాదాపు రూ. 10 కోట్ల బడ్జెట్ తో ఏత్ బార్ నిర్మించారు. స్టార్ క్యాస్ట్ నటించినప్పటికీ కథలో విషయం లేకపోవడంతో ఏత్ బార్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కేవలం రూ. 7-8 కోట్ల వసూళ్ళు రాబట్టింది.
ఏత్ బార్ నష్టాలు మిగిల్చిన నేపథ్యంలో రతన్ టాటా మరలా సినిమా నిర్మాణం వైపు రాలేదు. ఏత్ బార్ 1996లో విడుదలైన అమెరికన్ మూవీ ఫియర్ స్ఫూర్తితో తెరకెక్కించారు.
ఏత్ బార్ మూవీ కథ విషయానికి వస్తే… రియా(బిపాసా బసు) ఆర్యన్(జాన్ అబ్రహం) ప్రేమించుకుంటారు. రియా తండ్రి డాక్టర్ రన్వీర్ మల్హోత్రా(అమితాబ్). ఆర్యన్ ఒక సైకోపాత్ అని, అతని వలన తన కూతురుకి ఆపద ఉందని రన్వీర్ తెలుసుకుంటాడు. రియాను ఎలాగైనా ఆర్యన్ నుండి కాపాడాలని ప్రయత్నం చేస్తాడు. ఆర్యన్ పై రియాకి ఉన్న ప్రేమను ఎలా భగ్నం చేశాడు? సైకోపాత్ లవర్ ఆర్యన్ ప్రేయసి కోసం రన్వీర్ ని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది కథ..
కాగా 84 ఏళ్ల రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. సోమవారం అస్వస్థతకు గురైన రతన్ టాటా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను క్షేమంగానే ఉన్నానని ఆయన ఆసుపత్రిలో చేరిన అనంతరం తెలియజేశారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మరణించారు. విలువలు కలిగిన పారిశ్రామిక వేత్తగా పేరు తెచ్చుకున్న రతన్ టాటా… భారతదేశ పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
రతన్ టాటా మృతిపై దేశ ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది.
Web Title: Only one movie produced by ratan tata what is the subject do you know what the result is
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com