Ginna Movie Overseas Collections: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్, మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా తర్వాత మంచు విష్ణు నుండి విడుదల అవుతున్న మొదటి సినిమా కావడం..అందులోనూ పాయల్ రాజ్ పుట్ మరియు సన్నీ లియోన్ వంటి టాప్ హీరోయిన్స్ ఉండడం తో ఈ సినిమాకి హైప్ జెనెరేట్ అవుతుందని అనుకున్నారు కానీ అవ్వలేదు..సంపూర్ణేష్ బాబు సినిమాకి వచ్చే ఓపెనింగ్స్ లో సగం కూడా ఈ సినిమా దక్కించుకోలేకపోయింది.

ఈ సినిమా ఓపెనింగ్స్ చూస్తూ ఉంటె నాలుగు దశాబ్దాల నుండి మోహన్ బాబు ఫామిలీ ఇండస్ట్రీ దక్కించుకున్న స్టార్ స్టేటస్ ఇంతేనా అని ఆశ్చర్యపోక తప్పదు..ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ లో విడుదల అవ్వడమే ఎక్కువ అనుకుంటే..ఓవర్సీస్ లో కూడా విడుదల చేసారు..అక్కడ ఈ సినిమా చాలా అరుదైన రికార్డుని నెలకొల్పింది..భవిష్యత్తులో ఈ రికార్డుని ఎవ్వరు ముట్టుకోలేరు కూడా.
ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాకి USA లో ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకి కలిపి కేవలం 430 డాలర్లు మాత్రమే వచ్చాయి..ఇప్పటి వరుకు ఇలాంటి వసూళ్లు కేవలం సంపూర్ణేష్ బాబు కి మాత్రమే వచ్చాయి..సంపూర్ణేష్ బాబు హీరో గా నటించిన ‘కొబ్బరి మట్ట’ సినిమాకి ఫుల్ రన్ లో 3 వేల డాలర్లు వచ్చాయి..కానీ జిన్నా భాయ్ బాక్స్ ఆఫీస్ ఊపు చూస్తుంటే అందులో సగం వసూళ్లను కూడా రాబట్టేలా లేడు..మరో అరుదైన రికార్డు ఏమిటి అంటే జిన్నా సినిమాకి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకి కలిపి కేవలం 49 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి..ఇది ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు గా చెప్పుకోవచ్చు.

ఇక ఆస్ట్రేలియా లో అయితే ఈ సినిమాని 5 లొకేషన్స్ లో విడుదల చేసారు..ఈ 5 లొకేషన్స్ కి కలిపి ఈ సినిమా ఒక్క టిక్కెట్టు కూడా అమ్ముడుపోకపోవడం విశేషం..అంత స్టార్ కాస్టింగ్ ని పెట్టుకొని, పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ కూడా ఇలాంటి అరుదైన ఘనత దక్కడానికి ప్రధాన కారణం మంచు విష్ణు కి ఉన్న నెగటివిటీనే అని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం.