Sarkaru vari pata: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ లో మంచి గుర్తింపు అలానే సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ తమన్ ఉంటారు. ప్రస్తుత కాలంలో తమన్ తన మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఎస్ తమన్ చేతిలో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి సర్కారు వారి పాట,ఘనీ,భీమ్లా నాయక్ చిత్రాల మ్యూజిక్ అప్ డేట్ ను తెలియజేస్తాం అంటున్నారు తమన్. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ” సర్కారు వారి పాట”.

ఈ సినిమాలో మహేష్ జంటగా కీర్తిసురేష్ నటిస్తుంది బ్యాంకింగ్ రంగంలో జరిగే అతిపెద్ద కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో సూపర్ స్టార్ చాలా స్టైలిష్‌గా కనిపించడంతో అభిమానులలో ఈ చిత్రం పై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు, అయితే ఇప్పుడు విడుదలను వాయిదా వేస్తున్నారట.
అయితే కీర్తి సురేష్ కు సంబంధించిన అభిమానులు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని కీర్తితో “సర్కారు వారిపాట”లో ఒక పాట పాడించవచ్చుగా అని అడిగారట,దీనికి సమాధానంగా పాడటం లేదు కాని వయోలిన్ వాయిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు తమన్.ఇదిలా ఉంటే కీర్తి వయోలిన్ వాయించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే చూడాలి కీర్తి ఏ రేంజ్ లో వయోలిన్ వాయించింది అనేది వినాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.