https://oktelugu.com/

‘ఆర్ఆర్ఆర్’ నుండి బిగ్ అప్ డేట్ !

రేపు ‘జూనియర్ ఎన్టీఆర్’ పుట్టినరోజు. కోమరం భీమ్‌ గెటప్ లో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించే ఓ ఘనమైన సరికొత్త పోస్టర్‌ ను రాజమౌళి సిద్ధం చేయించాడని, తారక్ పుట్టినరోజు నాడు అనగా రేపు ఆ పోస్టర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే మేము వెల్లడించాము. మేము గతంలో రివీల్ చేసిన వార్తకు తగ్గట్టుగానే మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుండి అధికారికంగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ట్వీట్ చేస్తూ.. […]

Written By: , Updated On : May 19, 2021 / 06:46 PM IST
Follow us on

RRR Movieరేపు ‘జూనియర్ ఎన్టీఆర్’ పుట్టినరోజు. కోమరం భీమ్‌ గెటప్ లో ఎన్టీఆర్ ను కొత్తగా చూపించే ఓ ఘనమైన సరికొత్త పోస్టర్‌ ను రాజమౌళి సిద్ధం చేయించాడని, తారక్ పుట్టినరోజు నాడు అనగా రేపు ఆ పోస్టర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారని ఇప్పటికే మేము వెల్లడించాము. మేము గతంలో రివీల్ చేసిన వార్తకు తగ్గట్టుగానే మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుండి అధికారికంగా ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ట్వీట్ చేస్తూ.. ‘రేపు ఉదయం 10 గంటల సమయంలో కొమరం భీమ్ కు సంబంధించిన ఓ అదిరిపోయే ఆసక్తికర విషయాన్ని విడుదల చేయబోతున్నాం. దయచేసి అభిమానులంతా రేపు ఇళ్లలోనే ఉండండి. బయటకు వచ్చి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించొద్దు’ అంటూ పోస్ట్ చేస్తూ మెసేజ్ చేశారు. మరి, రేపు ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి రాజమౌళి ఏమి రివీల్ చేయబోతున్నాడో ? ఎలాంటి పోస్టర్ ను రిలీజ్ చేస్తాడో చూడాలి.

మరోపక్క రేపు ఉదయం ఎప్పుడు అవుతుందా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఆసక్తిని మరియు అంచనాలను అందుకోవాలంటే.. వచ్చే ఆ అప్ డేట్ నిజంగానే ఓ రేంజ్ లో అదిరిపోవాలి. ఎలాగూ ‘రామ్ చరణ్’ పుట్టినరోజున, అల్లూరి గెటప్ లో ఉన్న చరణ్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులకు ఫుల్ కిక్ ను ఇచ్చాడు జక్కన్న. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్ డేకి కూడా సర్ ప్రైజ్ చేస్తాడేమో చూడాలి.

ఇక ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా కూడా భారీ ఆసక్తి నెలకొంది. పైగా ఈ మల్టీస్టారర్ లో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుండటం, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండటం, అలాగే మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటంతో.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.