OkTelugu MovieTime:మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే… స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘లాఠీ’ సినిమా స్టంట్ సీక్వెన్స్ చేస్తుంటే గాయాలయ్యాయి. చికిత్స కోసం కేరళ వెళ్తున్నా’ అని విశాల్ వెల్లడించాడు. అయితే.. విశాల్ చేతి ఎముకలకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సునయన హీరోయిన్.

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విషయానికి వస్తే.. సీఎం జగన్ బీసీల పక్షపాతి అని సినీ నటుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. విజయవాడ బీసీ భవన్‌లోని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చాంబర్‌కు వచ్చిన ఆయనను సత్కరించారు. సీఎం జగన్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీలకు ఒక భవన్‌ను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లను ఏర్పాటు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.

అలాగే మరో అప్ డేట్ ఏమిటంటే.. సినీనటులు షూటింగ్ గ్యాప్ దొరికితే.. రిలాక్స్ అయ్యేందుకు హాలీడే ట్రిప్‌లకు వెళ్తుంటారు. అక్కడ సేద తీరుతుంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే సైతం తన హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో రిలాక్స్ అవుతోంది. కుటుంబంతో కలిసి 13ఏళ్ల తర్వాత ఇలా టూర్ కు వచ్చానని.. సోషల్ మీడియాలో తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. విక్రమ్ నటించిన ‘మహాన్’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు ఎక్కడా హీరోయిన్ వాణీ భోజన్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ప్రమోషన్లలో భాగంగా వాణీ పోస్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసినా మూవీలో ఒక్క ఫ్రేమ్‌లోనూ కనిపించలేదు. అయితే సినిమా రన్‌టైమ్ ఎక్కువ కావడంతోనే వాణీ సీన్స్ కట్ చేశారని కొందరు, మహాన్-2లో కనిపించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.
[…] […]
[…] Vijaya Bapineedu: సినిమా రంగంలో ఎన్నో లొసుగులు ఉంటాయి. వాటిని తట్టుకుని ఎక్కువ సంవత్సరాలు సినీ ఇండస్ట్రీలో ఉండటం అంటే.. అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన సినీ ప్రముఖుల్లో ఒకరిగా నిలిచారు విజయ బాపినీడు గారు. ఆయన అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. తెలుగు సినిమా దర్శకుడు, ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు.ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు కూడా.ఆయన అనేక యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. […]