OG vs Coolie: ఈ వీకెండ్ మూవీ లవర్స్ కి మంచి టైం పాస్ అయ్యింది. ఎందుకంటే నిన్న సాయంత్రం గంట వ్యవధి లో సౌత్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ గా పిలవబడే ‘ఓజీ'(They Call Him OG), ‘కూలీ'(Coolie Movie) సినిమాలకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్స్ వచ్చాయి. ఓజీ నుండి ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైతే, మరో పక్క కూలీ నుండి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఈ రెండిట్లో ఓజీ ‘ఫైర్ స్ట్రోమ్'(Fire Storm) పాటకే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొంతమంది ఈ పాటలోని లిరిక్స్ అర్థం కాలేదని అన్నప్పటికీ కూడా, వీడియో కంటెంట్ విజువల్ ఫీస్ట్ లాగా ఉండడం తో పాట పెద్ద హిట్ అయ్యింది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) ‘కూలీ’ ట్రైలర్ అదిరిపోతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆ ట్రైలర్ ఫ్యాన్స్ ని ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
Also Read: పండు.. పండు.. ఢీ షోలో అందరినీ అల్లాడించావ్ పో!
అందుకు ముఖ్య కారణం అనిరుద్(Anirudh Ravichander) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అనే అనుకోవచ్చు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కూడా భారీ ఎలివేషన్స్ ని ఈ ట్రైలర్ లో చూపించలేదు. చాలా మామూలుగానే ట్రైలర్ ని వదిలాడు. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేసిందే అని, హద్దులు దాటిన అంచనాల నుండి తప్పించుకోవడం కోసమే ఇలా ట్రైలర్ ని కట్ చేశారని, సినిమాలో రజనీకాంత్ విశ్వరూపం చూస్తారని అంటున్నారు. ఇక ‘ఓజీ’ విషయానికి వస్తే, అభిమానుల్లో ఈ పాట ఇచ్చిన ఉత్సాహం సాధారణమైనది కాదు. ‘హరి హర వీరమల్లు’ ఫలితంతో డీలాపడిపోయిన అభిమానుల్లో ఎక్కడలేని ఉత్సాహం ని తీసుకొచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాస్త మిక్సింగ్ విషయం లో జాగ్రత్తలు తీసుకొని వాయిస్ ని లౌడ్ చేసి ఉండుంటే ఈ పాట పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే ది బెస్ట్ గా ఉండేది. ఇప్పటికీ ఇంచుమించు అదే రేంజ్ లో ఉంది అని అనుకోండి. ఇకపోతే లైక్స్ విషయం లో ఓజీ ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది.
Also Read: మహావతార్ నరసింహ’ యూనివర్స్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..?
అభిమానులు చెప్తున్న లెక్కల ప్రకారం ఇంతకు ముందు లైక్స్ విషయం లో ఆల్ టైం రికార్డుగా ఉన్నటువంటి ‘కళావతి(సర్కారు వారి పాట)’ లిరికల్ వీడియో సాంగ్ లైక్స్ రికార్డ్స్ (#806K) రికార్డు ని, ‘ఫైర్ స్ట్రోమ్(ఓజీ)’ పాట 24 గంటల్లో 830K లైక్స్ తో బద్దలు కొట్టి ఆల్ టైం టాలీవుడ్ రికార్డుగా నిల్చింది. అదే విధంగా 24 గంటల్లో వ్యూస్ 62 లక్షల వరకు రాగా, కామెంట్స్ 30 వేలకు పైగానే వచ్చింది. ప్రతీ పాటకు యాడ్స్ వేస్తుంటారు మన టాలీవుడ్ నిర్మాతలు, కానీ ఈ సినిమాకు మాత్రం ఎలాంటి యాడ్స్ వెయ్యలేదు, వచ్చిన ప్రతీ వ్యూ జెన్యూన్ గా వచ్చిందట. ఇక కూలీ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ ట్రైలర్ కి 673K లైక్స్ రాగా, 13 మిలియన్ కి పైగా వ్యూస్, 29 వేల కామెంట్స్ వచ్చాయి.