OG Movie Song Theatres Response: సరిగ్గా పది రోజుల క్రితం విడుదలైన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం అభిమానులను ఎంత నిరాశ పరిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంతో ఉత్సాహం తో 700 రూపాయిలు టికెట్ కొనుగోలు చేసి థియేటర్ కి వెళ్లిన అభిమానులు, సినిమా అయిపోయాక నెత్తురు చుక్క కూడా ముఖం మీద లేకుండా దిగాలుతో తిరిగి వచ్చారు. అలా నిరుత్సాహ లో ఉన్న అభిమానులకు నేడు ఓజీ(They Call Him OG) చిత్రం నుండి విడుదలైన ‘ఫైర్ స్ట్రోమ్’ లిరికల్ వీడియో సాంగ్ ఇచ్చిన ఊపు సాధారణమైనది కాదు. ‘పగ రగిలే ఫైరూ’ అంటూ మొదలైన లిరిక్స్ అభిమానుల మతి నుండి పోవడం లేదు. ఇప్పటికి ఈ పాటని వాళ్ళు ఎన్ని సార్లు విని ఉంటారో ఊహించుకోవచ్చు. థమన్ స్వరపరిచిన పాట ఒక ఎత్తు అయితే, లిరికల్ వీడియో సాంగ్ లో వచ్చే కొన్ని షాట్స్ ని పరిశీలిస్తే అసలు సుజీత్ ఏమి ప్లాన్ చేశాడు?, థియేటర్స్ లో అభిమానులను బ్రతకానిచ్చేలా లేడుగా అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: చిన్న తేడా వచ్చినా గల్లంతే..లోకేష్ కనకరాజ్ కొంప ముంచాడుగా!
ఆ రేంజ్ లో వాళ్లకు ఈ వీడియో ఎక్కేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారు డిక్కీ నుండి కత్తి తీసేటప్పుడు లోపల ఆయన చంపినా మనుషుల శవాలు ఉండడం, బైక్ చేస్ చేస్తూ గ్రానైట్ బాంబులు విలన్స్ మీద వేయడం. కత్తి తో తనని చేస్ చేసే వాళ్ళని తెగ నరుకుతూ అదే కత్తిని నెల మీదకు వాల్చి స్టైల్ గా బైక్ ని ఆపడం, అబ్బో..ఇలా ఒక్కటా రెండా అభిమానులకు ప్రతీ ఫ్రేమ్ విజువల్ ఫీస్ట్ లాగా ఉండేలా చేసినట్టు ఈ పాట ని చూస్తే అర్థం అవుతుంది. బీచ్ రోడ్డు నుండి పవన్ కళ్యాణ్ స్టైల్ గా నడుస్తూ వచ్చే షాట్ ని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. ఇలా పాట లో చూపించిన ప్రతీ షాట్ ఫ్యాన్స్ కి ఒక విజువల్ వండర్ అని చెప్పొచ్చు.
Also Read: OG..ఓజాస్..గంభీరా.. ఒక్క పాటతోనే సునామీ సృష్టించేశారుగా!
ఈ పాట ని చూసిన తర్వాత ప్రతీ ఒక్క అభిమానికి కలిగిన ఫీలింగ్ ఏమిటంటే, ఇదండీ అసలు సిసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే అని అంటున్నారు. వాస్తవానికి ఈ పాటని నేడు సాయంత్రం విడుదల చేయాల్సి ఉంది. కానీ కొంత బిట్ సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో మేకర్స్ వెంటనే పూర్తి పాటని విడుదల చేసేశారు. ఎలాంటి అలెర్ట్ లేకుండా విడుదల చేసినప్పటికీ కూడా ఈ పాటకు లక్షల కొద్దీ లైక్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ అతి తక్కువ సమయం లోనే వచ్చేసింది. దీనిని బట్టీ ఈ సినిమాకు జనాల్లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ పాట ఇంకా ఎన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుంది అనేది.