OG Pre Release Event: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా మేకర్స్ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా నుండి విడుదల చేసిన ఫైర్ స్ట్రోమ్ లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ ఈ సాంగ్ అన్ని మ్యూజిక్ మాధ్యమాలలో ట్రెండ్ అవుతూనే ఉంది. రేపు ఈ సినిమాకు సంబంధించిన రెండవ పాత ‘సువ్వి సువ్వి’ విడుదల కానుంది. మెలోడీ సాంగ్ గా పిలవబడుతున్న ఈ పాట కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పాట పవన్ కళ్యాణ్ కి అత్యంత ఇష్టమైన పాట అట, ప్రతి రోజు ఆయన ఈ పాట ని వింటూనే ఉంటాడని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పాడు.
Also Read: ‘ఢీ 20’ షో నుండి పండు మాస్టర్ అవుట్..? కారణం ఏమిటంటే!
మరి ఆ పాటకు నిజంగా అంత దమ్ము ఉందా లేదా అనేది కొన్ని గంటల్లో తేలనుంది. ఈ పాట తర్వాత సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా యాక్షన్ టీజర్ ని వదలనున్నారు. ఆ తర్వాత ఓజాస్ గంభీర ప్రపంచం ఎలాంటిదో ఒకసారి చూపిస్తారట. సినిమాపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఇలాంటి కంటెంట్స్ ఒక్కొక్కటిగా వదిలితే ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఆసక్తి కరమైన అప్డేట్ వచ్చింది. మేకర్స్ వచ్చే నెల 18వ తారీఖున ఆంధ్ర ప్రదేశ్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సాధ్యమైనంత వరకు వైజాగ్ లోనే నిర్వహించాలని అనుకుంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఆడిటోరియం లో చేసినందుకు ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
కానీ ఈసారి మాత్రం లక్షలాది మంది అభిమానుల సమక్షం లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఓపెన్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తారట. వైజాగ్ తో పాటు భీమవరం, తిరుపతి ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. అంతే కాకుండా నార్త్ ఇండియా లో కూడా ఈ చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారట. ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, సందీప్ వంగ వంటి వాళ్ళు ముఖ్య అతిధులుగా హాజరు అవుతారట. ఈ ఈవెంట్ అభిమానులు జీవితాంతం గుర్తించుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 29 నుండి నార్త్ అమెరికా లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టబోతున్నారట.