OG Movie Collections: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి వీకెండ్ ని పూర్తి చేసుకుంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 252 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నిర్మాతలు కూడా కాసేపటి క్రితమే కలెక్షన్స్ పోస్టర్ ని విడుదల చేశారు. మొదటి వీకెండ్ వసూళ్లు అద్భుతం, అందులో ఎలాంటి సందేహం లేదు, సోమవారం అనగా నేడు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడిందా లేదా అనేదే కీలకం. పవన్ కళ్యాణ్ ప్రతీ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా వీకెండ్ వసూళ్లు భారీగా వస్తుంటాయి. కానీ ఆ తర్వాత డ్రాప్ అవుతుంటాయి. భీమ్లానాయక్, బ్రో ది అవతార్,హరి హర వీరమల్లు చిత్రాలు అందుకు ఒక ఉదాహరణ. కానీ ‘ఓజీ’ చిత్రం మాత్రం సోమవారం రోజున కూడా నిలబడింది. అంటే ఈ చిత్రానికి కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది అనేది స్పష్టమైంది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కచ్చితంగా వచ్చేలా అనిపిస్తుంది. లాంగ్ వీకెండ్ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ తగ్గించకపోయినా కూడా ఈ రేంజ్ వసూళ్లు రావడం చిన్న విషయం కాదు. ఇప్పుడే ఇలా ఉందంటే, ఇక దసరా పండగ రోజు, ఆ తర్వాత వీకెండ్ మొత్తం కళ్ళు చెదిరే గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ వీకెండ్ లోనే అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ ని సంపాదించి చాలా కాలమే అయ్యింది. ఆయన చివరి సూపర్ హిట్ చిత్రం అత్తారింటికి దారేది. ఆ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ప్రతికూల పరిస్థితుల్లో విడుదల అయ్యాయి. లేదంటే ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్ హిట్స్ అయ్యేవి.
పరిస్థితులు కలిసి రాకపోవడం తో ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా ఎబోవ్ యావరేజ్ రేంజ్ లో నిలిచాయి. కానీ ఓజీ మాత్రం 10 రోజుల్లోనే క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇదే తరహా రన్ కొనసాగితే రాబోయే రోజుల్లో ఈ చిత్రం 400 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరుతుందని అంటున్నారు ఫ్యాన్స్. టికెట్ రేట్స్ తగ్గిన తర్వాత ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తారని, ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతం లో ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రానికి కూడా ఇలాంటి రన్ వచ్చిందట. అదే తరహా రన్ ని ఓజీ కి ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుందో.