OG Movie First Week Collection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఓజీ'(They Call Him OG) చిత్రం విడుదలై వారం రోజులు పూర్తి అయ్యింది. ఈ వారం రోజుల్లో ఈ చిత్రం అభిమానులకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను మిగిలించింది. రెండు నెలల క్రితమే ‘హరి హర వీరమల్లు’ చిత్రం తో పవన్ కళ్యాణ్ తన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. కానీ ఓజీ చిత్రం తో అటు కంటెంట్ పరంగా, ఇటు కలెక్షన్స్ పరంగా అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారు. మొదటిరోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా #RRR రికార్డు ని బద్దలు కొట్టి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత ప్రీ దసరా సీజన్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ, ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఈ చిత్రం. దసరాకి ముందే 90 శాతం కి పైగా బ్రేక్ ఈవెన్ ని సాధించిన ఈ చిత్రం, ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో చూద్దాం.
నైజాం ప్రాంతంలో 45.13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతమ్ లో 15 కోట్ల 56 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 11 కోట్ల 8 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల 84 లక్షలు, కృష్ణ జిల్లాలో 8 కోట్ల 54 లక్షలు, గుంటూరు జిల్లాలో 9 కోట్ల 48 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 13 కోట్ల 33 లక్షలు, నెల్లూరు జిల్లాలో 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 115 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి అక్షరాలా 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద కాస్త అటు ఇటుగా ఈ చిత్రం 160 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 260 కోట్ల వసూళ్లను రాబట్టింది.
పైన చెప్పిన కలెక్షన్స్ ప్రకారం ఈ సినిమా దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మాత్రం ఈ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రాకపోతే రాబోయే రోజుల్లో ఈ మార్కుని అందుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఓవర్సీస్, కర్ణాటక ప్రాంతాల్లో మాత్రం పెట్టిన ప్రతి పైసా కి పదింతలు లాభాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ లాంగ్ రన్ వసూళ్లు ఉండొచ్చు.