OG Movie Collection: చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో సక్సెస్ ని చూసి ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా చేస్తున్న విద్వంసం అంతా ఇంతా కాదు. ఒక పక్క భారీ వర్షాలు పడుతున్నాయి, తెలంగాణ జిల్లాల్లో బయటకు అడుగుపెట్టే పరిస్థితిలు చాలా చోట్ల లేవు, అయినప్పటికీ కూడా జోరు ఏ మాత్రం తగ్గలేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి మూడు రోజుల్లోనే 75 శాతం కి పైగా రీకవరీ రేట్ ని సాధించింది. ఒక స్టార్ హీరో సినిమాకు ఇంత తక్కువ సమయం లో, ఈ రేంజ్ రీకవరీ జరగడం ఇప్పటి వరకు ఎవ్వరూ చూడలేదు. ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో మొదటి రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సంచలనం సృష్టించింది. ఇది కూడా ఒక అరుదైన సంఘటన.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు మూడు రోజుల్లో 220 కోట్ల రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ కి ఇది మొట్టమొదటి 200 కోట్ల సినిమా. అంతే కాదు, కేవలం తెలుగు వెర్షన్ నుండి మూడు రోజుల్లో ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఏకైక సినిమా కూడా ఇదే. హిందీ వెర్షన్ లో భారీగా విడుదల చేసుంటే, కచ్చితంగా ఈ చిత్రం ఇంకా గొప్ప అద్భుతాలను నెలకొల్పేది. నెట్ ఫ్లిక్స్ తో కుదిరించుకున్న నాలుగు వారాల ఒప్పందం కారణం గా, బాలీవుడ్ నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి అంగీకరించలేదు. అక్కడి నేషనల్ ప్లెక్సెస్ లో విడుదల చెయ్యాలంటే కనీసం 8 వారాలు ఓటీటీ లో విడుదల చేయకూడదు. అలా ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది ఈ సినిమా. ఇది కేవలం నిర్మాత జాప్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే నార్త్ ఇండియా లో విడుదలైన సింగిల్ స్క్రీన్స్ ద్వారానే ఈ చిత్రం మంచి డీసెంట్ వసూళ్లను రాబట్టింది. కానీ అక్కడి ఆడియన్స్ ఎక్కువ శాతం నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమాలను చూసేందుకే ఇష్టపడుతారు. ఒకవేళ ఓజీ 2 చిత్రం నిజంగానే ఉంటే, ఆ సినిమాకు అయినా హిందీ వెర్షన్ లో భారీ రిలీజ్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఓజీ చిత్రం ఓటీటీ లోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద హిట్ అవ్వొచ్చు. నార్త్ ఇండియన్స్ ఈ చిత్రాన్ని ఎగబడి చూసే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి సీక్వెల్ పై క్రేజ్ వేరే లెవెల్ లో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కచ్చితమైన ప్లానింగ్ తో వస్తే సీక్వెల్ కి వెయ్యి కోట్లు కొట్టేంత కెపాసిటీ కూడా ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.