OG director Sujeeth: 13 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) వీరాభిమాని గా ‘గబ్బర్ సింగ్’ సినిమాకు వెళ్లి గోల చేసిన సుజిత్, నేడు అదే పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ'(They Call Him OG) లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాని తీసి, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా చేరిపోయాడు. ‘రన్ రాజా రన్’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్, ఆ తర్వాత ప్రభాస్ తో సాహూ చిత్రం తీసాడు. రెండవ సినిమానే అంత పెద్ద సూపర్ స్టార్ తో చేసే బాధ్యత రావడం తో కాస్త తడబడ్డాడు, కానీ మంచి స్టైలిష్ మేకర్స్, కొన్ని మార్పులు చేసుకుంటూ సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలుస్తాడు అని అంతా అనుకున్నారు ఆడియన్స్. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు ‘ఓజీ’ చిత్రాన్ని చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు.
పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఇచ్చిన డేట్స్ కేవలం 38 రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయం లో ఆయనతో ఆ రేంజ్ ఔట్పుట్ సినిమాని రప్పించడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇక్కడే సుజిత్ స్టార్ హీరోలకు, భారీ ప్రొడక్షన్ హౌస్ లకు బాగా నచ్చేసాడు. రీసెంట్ గానే KGF , సలార్ వంటి చిత్రాలను తెరకెక్కించిన ‘హోమబుల్ ఫిలిమ్స్’ సంస్థ సుజిత్ తో ఒక భారీ డీల్ పెట్టుకున్నట్టు సమాచారం. ఎన్ని సినిమాలు ఆ బ్యానర్ లో చేయబోతున్నాడు అనేది స్పష్టంగా తెలియదు కానీ, అడ్వాన్స్ గా ఆ సంస్థ నుండి 75 కోట్ల రూపాయిలు అందుకున్నాడట. కేవలం ఒకే ఒక్క సినిమాతో సుజిత్ రేంజ్ ఎలా మారిపోయిందో మీరే చూడండి. అంతే కాదు ప్రభాస్ తో ఒక సరికొత్త సినిమా చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాడు అట. రీసెంట్ గానే ఆయన్ని కలిసి స్టోరీ లైన్ వినిపించాడని, అది ఆయనకు చాలా బాగా నచ్చిందని అంటున్నారు.
ప్రస్తుతం సుజిత్ ద్రుష్టి మొత్తం ‘బ్లడీ రోమియో’ సినిమా మీదనే ఉంది. నేచురల్ స్టార్ నాని హీరో గా నటించబోతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ని ఏప్రిల్ నెల నుండి మొదలు పెడుతాడట. ఈ సినిమా పూర్తి అయినా వెంటనే పవన్ కళ్యాణ్ తో ఓజీ సీక్వెల్, ఓజీ ప్రీక్వెల్ చేయబోతున్నాడని టాక్. ఈ రెండు సినిమాలను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిస్తారట. ఇలా ఓజీ తర్వాత కెరీర్ మొత్తం ఫుల్ బిజీ గా నింపేసుకున్నాడు సుజిత్. మూడేళ్ళ తన విలువైన సమయాన్ని ఓజీ చిత్రం కోసం కేటాయించినందుకు సుజిత్ కి మంచి కెరీర్ దొరికిందని, సరైన ప్లానింగ్ తో ముందుకు పోతే, ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలుస్తాడని అంటున్నారు విశ్లేషకులు.